సూపర్ స్టార్ సినిమా ఇక లేనట్టేనా కోట్లు పెట్టిన నిర్మాతలు ఏమైపోవాలి ..?
Vedha - December 4, 2020 / 09:00 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ యంగ్ హీరోలతో సమానంగా ఇంకా చెప్పాలంటే వాళ్ళంకంటే దూకుడుగా సినిమాలు కమిటవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు యంగ్ హీరోల కంటే స్పీడ్ గానే తన సినిమాలు రిలీజ్ చేస్తూ షాకిస్తున్నారు. ఈ వయసులోనూ రజనీ స్టామినా చూసి అన్నీ చిత్రపరిశ్రమలోని వారు షాకవుతున్నారు. ఇప్పటికే కబాలి, కాలా, పేటా, రోబో 2.ఓ, దర్బార్ సినిమాలు వరసగా వచ్చిన సంగతి తెల్సిందే. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ రజనీ మ్యానియా ఏంటో అందరీకీ తెలిసిందే. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా రజనీ దూసుకు వెళుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి దర్బార్ వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమా తర్వాత వెంటనే మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమా మొదలు పెట్టాడు. వరసగా ఫ్లాప్స్ వస్తున్న కారణంగా శివ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్ అన్నాత్తే తో భారీ హిట్ కొట్టాలని భావించాడు. అందుకు కారణం తెలుగువాడైన శివ కోలీవుడ్ లో అజిత్ కి వరసగా బ్లాక్ బస్టర్ ఇస్తూ వచ్చాడు. దాంతో రజనీ కూడా భారీ మాస్ హిట్ కోరుకున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ అన్ని సినిమాలు మొదలైనప్పటికి రజనీ అన్నాత్తే మాత్రం మొదలవలేదు. కారణం ఆయన వయసు రిత్యా డాక్టర్స్ రిస్క్ చేయవద్దని సలాహాలివ్వడమే.
కాగా తాజాగా రజనీకాంత్ రాజకీయాలలో బిజీ కాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. సొంతగా ప్రార్టీ పెట్టబోతున్నట్టు రాజనీ కాంత్ వెల్లడించారు. ఈ క్రమంలో అందరూ అన్నాత్తే సినిమా పరిస్థితి ఏంటీ అని సందేహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరిగిన ఈ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోతే నిర్మాతల పరిస్థితి ఏంటీ అని మాట్లాడుకుంటున్నారట. అయితే తన వల్ల చిన్న వాళ్ళకి కూడా నష్టం వాటిల్లితే భరించలేని సూపర్ స్టార్ భారీ బడ్జెట్ కేటాయించిన తనతో సినిమా తీసే నిర్మాత గురించి ఆలోచించరా. అందుకే ఈ సినిమాని కూడా రజనీ కంప్లీట్ చేయబోతున్నారని తెలిపారు. ఇక ఇప్పటికే సగానికి పైగా ఈ సినిమా పూరతైందట. కీర్తి సురేష్, ఖుష్బూ, నయనతార, మీనా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.