LIGER: ముంబైలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న లైగర్ గ్యాంగ్ .. వైరలవుతున్న ఫోటోలు

చార్మి.. ఈమె పేరులోనే కాదు, అందం అభినయంలోనూ చార్మింగ్ గా ఉంటుంది. తెలుగు సినిమాల్లో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగి నటించడం ఈమె స్పెషాలిటీ. సీరియస్, కామెడీ, ఎమోషన్, గ్లామర్ తో కూడుకున్న అభినయం చార్మి సొంతం. అయితే గత కొంతకాలంగా ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పింది. దీంతో హీరోయిన్ నుండి నిర్మాతగా టర్న్ అయ్యింది. ప్రొడ్యూసర్ గా కూడా తన స్టైల్ లో అద్దరగొడుతుంది. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు ప్రొడ్యూస్ చేసి మంచి పేరు సంపాదించుకుంది. ఫిల్మ్ ప్రొడక్షన్ పనులు దగ్గరుండి చూసుకుంటుంది. లేటెస్ట్ గా చార్మి నిర్మాతగా, పూరీ జగన్నథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా లైగర్. ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే జంటగా నటిస్తున్నారు.

ఈ సినిమా కోసం చార్మి నిర్మాతగా తన పూర్తి సహాకారం అందిస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన పోస్టులు, అప్డేట్స్ ఎప్పటికప్పుడు నెటిజన్లకు అందిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ముంబాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా హీరో విజయ్ దేవరకొండను స్కూటీపై ఎక్కించుకుని చక్కర్లు కొట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

లేటెస్ట్ గా చార్మి, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, సారా అలీఖాన్, కైరా అధ్వానీలతో కలిసి దిగిన ఫోటో ఆమె ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో కి నైట్ పార్టీలో తాము ఎంతగానో ఎంజాయ్ చేశామని.. అమేజింగ్ ఫుడ్ తో పాటు అమేజింగ్ పీపుల్ ని కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉందని రాసి హార్ట్ అండ్ హ్యాపీ ఎమోజీస్ తో పోస్ట్ చేశారు చార్మి. మరో ఫోటోలో వీరితో పాటు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ కూడా ఉన్నారు. లైగర్ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ లో కరణ్ జోహార్ కూడా ఒకరు.

Advertisement