Watch Value Worn By Chiranjeevi At Baby Success Meet : బేబీ సక్సెస్ మీట్ లో చిరంజీవి పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎన్ని కోట్లో తెలుసా..?

NQ Staff - August 3, 2023 / 10:59 AM IST

Watch Value Worn By Chiranjeevi At Baby Success Meet : బేబీ సక్సెస్ మీట్ లో చిరంజీవి పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎన్ని కోట్లో తెలుసా..?

Watch Value Worn By Chiranjeevi At Baby Success Meet :

మెగాస్టార్ చిరంజీవి ఈ నడుమ లగ్జరీ వస్తువులను మెయింటేన్ చేస్తున్నారు. గతంలో ఆయన ఇంత స్టైలిష్ లుక్ లో కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు సినిమాల్లోనే కాకుండా బయట కూడా చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. పైగా కొన్ని కాస్ట్యూమ్స్ ను స్పెషల్ గా డిజైన్ చేయించుకుని మరీ వాడేస్తున్నారు.

రీసెంట్ గా ఆయన బేబీ మూవీ సక్సెస్ మీట్ కు వచ్చారు. అయితే అందరూ చిరంజీవి ఏం మాట్లాడుతారా అని వెయిట్ చేస్తుంటే.. కొందరు మాత్రం ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మీద ఫోకస్ పెట్టారు. ఇందులో ఆయన బ్రౌన్ టీ ష‌ర్ట్‌, క్రీమ్ ప్యాంట్ వేసుకుని వచ్చారు. కాగా ఈ ఈవెంట్ కు ఆయన లో ఖరీదైన వాచ్ ను కూడా పెట్టుకున్నారు.

మార్కెట్ విలువ ఎంతంటే..?

ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ అనే మోడల్ కు చెందినది. ఈ వాచ్ అటు అభిమానులను.. ఇటు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. కాగా దీని ధర ఎంత అని కొందరు గూగుల్ లో వెతికారు. దాని ధర 230,000 డాలర్లుగా ఉంది. అది ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ.

అంటే అది మన ఇండియాలో రూ.1.89 కోట్లుగా ఉంది. అంటే దాదాపుగా 2 కోట్లు విలువ చేసే వాచ్ ను చిరంజీవి పెట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్.. మెగా స్టార్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 10న రాబోతోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us