WARNER: క్వారంటైన్ బోర్ కొడుతుందా.. వార్న‌ర్‌కు ఆయ‌న భార్య పంచ్..!

గ్రాండ్‌లో త‌న బ్యాట్‌తో బౌండ‌రీల వ‌ర్షం కురిపించే ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మన్.. ఐపీఎల్ ఆటగాడు డేవిడ్ వార్నర్ గ‌త ఏడాది లాక్‌డౌన్ నుండి టిక్‌టాక్ లో వ‌రుస వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ కు తెగ వినోదాన్ని అందిస్తున్నాడు. లాక్‌డౌన్ వ‌ల‌న అన్ని ఆట‌లు ర‌ద్ధు కావ‌డంతో పూర్తిగా ఇంటికే ప‌రిమిత‌మైన వార్న‌ర్ త‌న భార్య‌తో క‌లిసి నానా ర‌చ్చ చేశాడు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌కు చెందిన సూప‌ర్ హిట్ సాంగ్స్‌కు స్టెప్పులేశాడు. ఈ పాటలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేశాయి. టిక్ టాక్ బ్యాన్ చేశాక కొన్ని సార్లు స్టార్స్ డాన్స్ వీడియో బిట్ లను సేకరించి వాటిని మార్ఫింగ్ చేస్తూ అల‌రించాడు.

తాజాగా వార్న‌ర్ రాములో రాముల వీడియోని మ‌రోసారి షేర్ చేసి ట్రెండ్డింగ్ లో నిలిపేలా చేశాడు. . ఆ వీడియోకు వార్నర్ భార్య కాండీ స్పందించింది. ఐపీఎల్ క్యాన్సిల్ అయిన నేప‌థ్యంలో విదేశీ ఆటగాళ్లు అంద‌రు త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్లారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా తమ దేశంను చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆటగాళ్లు అంతా కూడా సిడ్నీలోని ఒక హోటల్ లో 14 రోజులు క్వారెంటైన్ లో ఉండాల్సి వచ్చింది. ఈ క్వారంటైన్ టైంలో ఏం చేయాలో తెలియక వార్న‌ర్ పాత మెమోరీస్‌ని బ‌య‌ట‌కు త‌వ్వుతున్నాడు.

తాజాగా రాములో రాముల పాట లోని అల్లు అర్జున్ ఫేస్ ను మార్ఫింగ్ చేసి తన ఫేస్ ను పెట్టిన వార్నర్ వీడియో షేర్ చేయడం జరిగింది. ఆ వీడియో పై కాండీ స్పందిస్తూ.. క్వారెంటైన్ లో బోర్ కొడుతుందా. వీడియోలు వరుసగా చేస్తున్నావు అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. భార్య కామెంట్స్ కు స్పందించిన వార్నర్ నా 14 రోజుల క్వారెంటైన్ ముగియబోతుంది. నా టార్చర్ ను భరించేందుకు సిద్దంగా ఉండూ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.