Narappa: నార‌ప్ప విష‌యంలో టాలీవుడ్-కోలీవుడ్ ఫ్యాన్స్ వార్

Narappa: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ – వెట్రిమారన్ కాంబోలో రూపొందిన బ్లాక్ బస్టర్ ‘అసురన్’ చిత్రాన్ని తెలుగులో నార‌ప్ప పేరుతో వెంక‌టేష్ రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైంది. క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం వ‌ల‌న థియేట‌ర్స్ కి జ‌నాలు రార‌నే అభిప్రాయంతో నార‌ప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి మిక్స‌డ్ రెస్పాన్స్ వ‌స్తుంది.

Narappa

వి క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై కలైపులి ఎస్.థాను – సురేష్ బాబు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌గా, ఈ చిత్రంలో వెంకీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచార‌ని టాలీవుడ్ అభిమానులు అంటున్నారు.దీనికి కోలీవుడ్ అభిమానులు ధ‌నుష్‌ని ఏమాత్రం రీచ్ కాలేక‌పోయార‌ని ట్విట్ట‌ర్‌లో కామెంట్స్ చేస్తున్నారు. అమెజాన్ లో ‘నారప్ప’ స్ట్రీమింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో దీని గురించే తెలుగు – తమిళ ఆడియన్స్ మధ్య కామెంట్ల వార్ జరుగుతోంది.

అసుర‌న్‌కి నార‌ప్ప‌కి సంబంధం లేకుండా సినిమా తీసి బోర్ కొట్టించార‌ని కోలీవుడ్ అభిమానులు అంటుంటే, వెంకటేష్ తన వయసుకు తగిన పాత్రలో అదరగొట్టాడని.. కొన్ని సన్నివేశాల్లో ధనుష్ ని మరిపించారని త‌మిళులు కాస్త అతి త‌గ్గించుకుంటే మంచిద‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా టాలీవుడ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రోవైపు గ‌తంలో వెంకటేష్ నటించిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాన్ని ధనుష్ రీమేక్ చేసిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా ట్విట్టర్ లో పరస్పర విమర్శలు చేసుకుంటూ టాలీవుడ్ వెర్సెస్ కోలీవుడ్ అనే విధంగా ట్వీట్లు పెడుతున్నారు. గ‌తంలో త‌మిళ చిత్రాలు తెలుగులో భారీగా రీమేక్ అయి మంచి విజ‌యం సాధించిన ఇంత గొడ‌వ ఎప్పుడు జ‌ర‌గ‌లేదు.

వెంక‌టేష్ నార‌ప్ప చిత్రం విష‌యంలో మాత్రం టాలీవుడ్ వ‌ర్సెస్ కోలీవుడ్ అన్న చందంగా మారింది. సెల‌బ్రిటీలు ఏ భేదం లేకుండా క‌లిసి ప‌ని చేస్తుంటే అభిమానులు ప్రాంతం, వ‌ర్గాలు అని చెప్పి నానా ర‌చ్చ చేస్తున్నార‌ని కొంద‌రు ఫైర్ అవుతున్నారు. ధ‌నుష్ త్వ‌ర‌లో టాలీవుడ్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌తో క‌లిసి సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే కదా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో స్టార్ డైరెక్టర్ శంకర్ #RC15 అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపొందించనున్నారు. అలానే రామ్ పోతినేని హీరోగా దర్శకుడు లింగుస్వామి ఓ బైలింగ్విల్ సెట్స్ పైకి తీసుకెళ్లారు.