Waltair Veerayya Movie : వీరయ్య టైటిల్ సాంగ్.! దేవిశ్రీప్రసాద్పై ఆ విమర్శలు తగ్గినట్టే.!
NQ Staff - December 27, 2022 / 11:12 AM IST

Waltair Veerayya Movie : ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ వచ్చేసింది. నిజానికి, ఈ టైటిల్ సాంగ్ మీద మెగాభిమానుల్లోనే చాలా అనుమానాలున్నాయ్. దానిక్కారణం, ‘బాస్ పార్టీ’, ‘శ్రీదేవి చిరంజీవి’ సాంగ్స్ ఒకింత నిరుత్సాహ పర్చడమే.
మాంఛి మాస్ మూవీగా ‘వాల్తేరు వీరయ్య’ స్టిల్స్ కనిపిస్తోంటే, ఆ స్థాయి మాస్ టచ్ పాటల్లో లేదనీ, హై ఓల్టేజ్ కిక్ ఇవ్వలేకపోయాడనీ దేవిశ్రీ ప్రసాద్ మీద మెగాభిమానులు చాలా గుస్సా అయ్యారు.
వీరాభిమాని.. విశ్వరూపం చూపించేశాడు
కానీ, దేవిశ్రీ ప్రసాద్ ఒక్క పాటతో ఈక్వేషన్స్ అన్నీ మార్చేశాడు. ‘వీరయ్య టైటిల్’ సాంగ్ ఓ ఊపు ఊపేస్తోంది. చాలామంది ఇళ్ళల్లో టీవీలు ‘వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్’తో మోత మోగిపోతున్నాయ్ నిన్న రాత్రి నుంచీ. ఆ స్థాయిలో టైటిల్ సాంగ్ డిజైన్ చేశారు.
లిరిక్స్ దగ్గర్నుంచి, మెగాస్టార్ చిరంజీవి లుక్, ఆటిట్యూడ్.. ఒకటేంటి.? మెగాభిమానులకు కావాల్సినంత హై ఓల్టేజ్ కిక్ అయితే లభించింది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మీద కూడా అభిమానుల గుస్సా ఒకింత తగ్గింది. అయితే, ముందు ప్రకటించిన సమయానికంటే కాస్త ఆలస్యంగా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేయడం అభిమానులకు నచ్చడంలేదు.
సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బాబీ, ఫ్యాన్ బాయ్ తరహాలో చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని తెరకెక్కించినట్లే కనిపిస్తోంది.