Janhvi Kapoor: జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి రావ‌డం జ‌రిగేనా?

Janhvi Kapoor: శ్రీదేవి కూతురు కావడంతో జాన్వీ కపూర్ కు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది.. ఇక్కడ ఒక్క సినిమా కూడా చేయకపోయినా తెలుగు ఇండస్ట్రీలో ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. చాలా రోజుల నుంచి కూడా ఈమెను తెలుగులో పరిచయం చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. శ్రీదేవి ఉన్నపుడు కూడా తన కూతురు తనలా సౌత్ లో పేరు తెచ్చుకున్నపుడే ఆనందంగా ఉంటానని చెప్పింది. అయితే ఆమె చనిపోవడంతో అమ్మ కోరిక తీర్చలేకపోయింది జాన్వీ కపూర్. కానీ తప్పకుండా తాను కూడా సౌత్ సినిమాల్లో నటిస్తానని చాలా రోజుల నుంచి చెప్తుంది జాన్వీ. కానీ సరైన కథ కావాలంటుంది. ఆ మధ్య విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు.

Janhvi Kapoor

దాంతో పాటు ట్రిపుల్ ఆర్ లో కూడా జాన్వీ నటిస్తుందనే వార్తలొచ్చినా అది నిజం కాలేదు. కానీ ఇప్పుడు శ్రీదేవి కూతురు టాలీవుడ్ వైపు వస్తుందని ప్రచారం గట్టిగానే జరుగుతుంది. అయితే ఈమె వచ్చే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే చాలా ఏళ్ళుగా జాన్వీని తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ అది జరగలేదు. ఈ మధ్యే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈమెను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆయన దర్శకత్వంలో జాన్వీ నటించబోతుందనే ప్రచారం జరిగింది. ఈయన సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య ఫామ్ లో లేడు కానీ కచ్చితంగా సరైన సినిమా పడితే కృష్ణవంశీ సంచలనం సృష్టిస్తాడనడంలో సందేహం లేదు.

Janhvi Kapoor

అలాంటిది కృష్ణవంశీ మొన్న లాక్ డౌన్ సమయంలో ఓ పవర్ పుల్ లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసాడని.. ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ సినిమా చూసిన తర్వాత తన కథకు జాన్వీ అయితేనే సరిపోతుందని భావించి అటు వైపు అడుగులు వేసాడని తెలుస్తుంది. బోనీ కపూర్‌తో కూడా కృష్ణవంశీకి మంచి పరిచయం ఉంది. ఆయనకు కూడా కథ చెప్పడం.. సానుకూలంగానే స్పందించడంతో కృష్ణవంశీ ఆనందంగా ఉన్నాడు. అప్పట్లో బోనీ కపూర్ నిర్మాతగా హిందీలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘శక్తి: ది పవర్‌’ చిత్రం రూపొందించారు. ఇది అంత:పురం సినిమాకు రీమేక్. ఇదిలా ఉంటే ఈయనతో పాటు మరికొందరు దర్శకులు కూడా జాన్వీ కోసం ప్రయత్నిస్తున్నా.. ఈమె మాత్రం అస్సలు తెలుగు ఇండస్ట్రీ వైపు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.