VNRTr1o : ఏం మాట్లాడినా వివాదం అవుతుందని రష్మిక కన్నీళ్లు

NQ Staff - March 22, 2023 / 08:40 PM IST

VNRTr1o : ఏం మాట్లాడినా వివాదం అవుతుందని రష్మిక కన్నీళ్లు

VNRTr1o   : నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కాకుండా మరే సినిమాలో కూడా ఇన్నాళ్లు నటించని రష్మిక ఎట్టకేలకు కొత్త సినిమాకు కమిట్ అయింది. గతంలో నితిన్ కి జోడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాను చేసిన రష్మిక మందన చేసిన విషయం తెల్సిందే.

ఈ కాంబోలో మరో సినిమా రాబోతుంది. వారిద్దరితో కలిసి రష్మిక వర్క్ చేయబోతుంది. నితిన్ కి జోడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సూపర్ హిట్ అవడంతో మరోసారి వీరి కాంబో సినిమా సక్సెస్ అవ్వడం ఖాయమంటూ అందరూ చాలా నమ్మకంగా ఉన్నారు. నేడు సినిమా అనౌన్స్మెంట్ ని చాలా విభిన్నంగా ప్లాన్ చేశారు.

VNRTr1o Announcement Video

VNRTr1o Announcement Video

ఉగాది సందర్భంగా విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియో లో రష్మిక మాట్లాడుతూ తాను ఏం మాట్లాడినా కూడా వివాదం అవుతుందని.. నితిన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల రష్మిక పలు సందర్భాల్లో వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. అందుకే ఈ వీడియోలో ఇలా ఫన్నీగా ప్లాన్ చేశారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us