బిగ్ బాస్ స్పాన్సర్ షిప్ నుండి కూడా తప్పుకున్న వివో

Admin - August 7, 2020 / 07:18 AM IST

బిగ్ బాస్ స్పాన్సర్ షిప్ నుండి కూడా తప్పుకున్న వివో

హైదరాబాద్: ఇండియా చైనా మధ్య జరుగుతున్న సరిహద్దు గొడవలు ఇండియాలోని చైనా సంస్థలపై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ గొడవల కారణంగానే ఇండియాలో ఇప్పటికే చైనాకు చెందిన చాలా యాప్స్ నిషేధానికి గురి అయ్యాయి. ఇందులో ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కూడా ఉంది. సరిహద్దు గొడవల ప్రభావం ఐపీల్ పై కూడా పడింది. ఐపీల్ ను స్పాన్సర్ చేస్తున్న వివో అందులో నుండి తప్పుకుంది. అయితే ఇప్పుడు తాజాగా వివో మరో రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది.

ప్రో కబడ్డీ లీగ్, బిగ్ బాస్ ను కూడా గత కొన్ని సంవత్సరాలుగా వివో మొబైల్ సంస్థనే స్పాన్సర్ చేసేది. అయితే సరిహద్దు గొడవల కారణంగా స్టార్ స్పోర్ట్స్ తో ఉన్న 60కోట్ల ప్రో కబడ్డీ స్పాన్సర్ షిప్ నుండి, 30 కోట్ల బిగ్ బాస్ స్పాన్సర్ షిప్ వివో వాటి నుండి తప్పుకున్నట్టు ప్రకటించింది. చైనా వస్తువులపై వస్తున్న నెగటివ్ ప్రచారానికి దూరంగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు.

Read Today's Latest Entertainment in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us