VIVEK : వివేక్ మృతితో షాక్‌లో స‌మంత‌, దేవి శ్రీ ప్ర‌సాద్.. హ‌ఠాన్మ‌ర‌ణంతో దిగ్భ్రాంతిలో తమిళ సినీ ప‌రిశ్ర‌మ‌

తమిళ స్టార్ కమెడియన్ వివేక్ కు హార్ట్ ఎటాక్ రావడం. ఆయన ఆసుపత్రిలో చేరడం, కొద్ది గంట‌ల‌లోనే మృత్యువాత ప‌డ‌డం వంటి వ‌రుస సంఘ‌ట‌న‌ల‌తో అభిమానులు శోక సంద్రంలో మునిగారు. కరోనా వ్యాక్సినేషన్ వేసుకున్న 24 గంటల్లో ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో చాలా మంది అదే కారణం అనుకున్నారు. ఆసుప‌త్రి బృందం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో వ్యాక్సినేషన్ తో ఎలాంటి సంబంధం లేదు.. ఈయనకు అనుకోకుండా వచ్చిన గుండెపోటు అని వైద్యులు తేల్చారు. వ్యాక్సినేషన్ తో ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చి చెప్పారు డాక్టర్లు. చెన్నైలోని SIMS ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న క్ర‌మంలో ఈ రోజు ఉదయం మృత్యువాత‌ప‌డ్డారు.

వివేక్ కు హార్ట్ ఎటాక్ రావ‌డంతో ఆయ‌న‌కు ECMO సపోర్ట్ అందించారు. అంటే కృత్రిమ శ్వాస అన్నమాట. గుండెతో పాటు ఇతర శరీర భాగాలకు కృత్రిమ పద్ధతిలో వైద్యం అందించారు. అయిన ఫ‌లితం లేకుండా పోయింది. గతంలో గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యంకు కూడా చాలా రోజుల పాటు ECMO సపోర్ట్ అందించారు. వివేక్ కు కూడా ఇలాంటి వైద్యం అందించారు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన కూడా వివేక్‌ను వైద్యులు కాపాడ‌లేక‌పోయారు. తమిళ ఇండస్ట్రీలోని హీరోలందరితోనూ నటించాడు వివేక్. వడివేలు తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన దాదాపు 250 సినిమాల్లో నటించాడు. 2009లోనే ఈయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ ఇచ్చింది.

డబ్బింగ్‌ చిత్రాలతో వివేక్‌ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. బాయ్స్‌, శివాజీ, ప్రేమికుల రోజు, అపరిచితుడు, సింగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు వివేక్ . ఆయ‌న‌‌ కొడుకు ప్రసన్నకుమార్‌ 13 ఏళ్ల వయసులో మొదడులో రక్తం గట్టకట్టడంతో చనిపోయాడు. ఇటీవ‌ల ఆయ‌న త‌ల్లి కూడా చ‌నిపోయింది. అప్ప‌టి నుండి వివేక్ చాలా కుంగిపోయాడు. వివేక్‌ ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్‌ మృతి పట్ల దేవీశ్రీ ప్రసాద్‌, ఏఆర్‌. రెహమాన్‌, సుహాసిని, ప్రకాశ్‌రాజ్, రాఘవ లారెన్స్‌, జీవా, సమంత, ధనుష్‌, విజయ్‌, సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వివేక్ మృతి ఇండ‌స్ట్రీకి తీర‌ని విషాదం. లెజండ‌రీ మృతి ఎంతో బాధిస్తుందని స‌మంత పేర్కొంది. దేవి శ్రీ, ఖుష్బూ సైతం వివేక్ మృతి ప‌ట్ల సంతాపం తెలియ‌జేస్తూ, ఆయ‌న మృతి తీర‌ని లోటు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement