Viva Harsha Weeding : వైవా హ‌ర్ష పెళ్లి పీట‌లెక్కాడు.. ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో మూడు ముళ్లు వేసిన యూట్యూబ‌ర్

Viva Harsha Weeding : హర్ష చెముడు.. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు. ‘వైవా’ కాన్సెప్ట్ తో షార్ట్ వీడియోలు తీసి సక్సెస్ అయ్యాడు. అందరికీ బాగా చేరువయ్యాడు. దీంతో వైవా హర్షగా అతడికి పేరు పడిపోయింది. ఆ తర్వాత 2014లో ‘మై నే ప్యార్ కియా’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

TheNewsQube-

కేవలం యూ ట్యూబ్ వీడియోల ద్వారా దాదాపు సెలబ్రెటీల రేంజ్‌లో క్రేజ్ కొట్టేసిన హర్ష.. పలు సినిమా అవకాశాలు పట్టేశాడు. వైవా హర్ష నటించిన కలర్ ఫోటో మూవీ సక్సెస్ అయింది. ఈ చిత్రంలో తన నటనతో అందరి మనసు దోచుకున్న వైవా హర్ష ప్రస్తుతం మెగా డాటర్ సుస్మిత నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు.

జ‌న‌వ‌రిలో అక్షర అనే అమ్మాయితో అతని ఎంగేజ్‌మెంట్ జరిగింది. కేవలం కొద్దిమంది మిత్రులతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్, కొణిదెల సుస్మిత ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే తన నిశ్చితార్ధానికి ముందు దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైవా హర్ష ‘ఇదే లాస్ట్ బ్యాచిలర్ సెల్ఫీ’ అంటూ ఆసక్తికర కామెంట్ పెట్ట‌డం అందరి దృష్టిని ఆక‌ర్షించింది.

గురువారం వైవా హ‌ర్ష వివాహం అక్ష‌ర‌తో జ‌ర‌గ‌గా, ఈ వివాహానికి నటుడు ప్రవీణ్, నిర్మాత ఎస్ కేఎన్ కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ద‌ర్శ‌కుడు మారుతి కూడా పెళ్లికి వ‌చ్చారు. ఆయ‌న వారితో క‌లిసిదిగిన ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

వైవా హర్ష పెళ్లి చేసుకున్న అమ్మాయి అక్షర విషయానికొస్తే ఆమె పూర్తి పేరు అక్షర రీసు.. ఎమ్.కాం పూర్తిచేసిన ఈ అమ్మాయి హర్షతో గత నాలుగేళ్ళుగా ప్రేమలో ఉండగా పెద్దలను ఒప్పించి తాజాగా ఈ జంట మూడుముళ్ళ బంధంతో ఒక్కటైనారు. వారికి నెటిజ‌న్స్, ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.