Vithika Sheru : వావ్ వితిక షెరు.! ఈ బిగ్‌బాస్ బ్యూటీ హాట్ అప్పీల్ చూశారా.?
NQ Staff - November 24, 2022 / 07:45 PM IST

Vithika Sheru : ‘పడ్డానండి ప్రేమలో మరి’ అంటూ ఓ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన జంట, నిజంగానే ప్రేమలో పడి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అలా రీల్ జంట కాస్తా, రియల్ జంటగా మారింది.

Vithika Sheru Latest Cute Video
ఎవరా జంట.? ఏంటా కథ.? అంటే, యంగ్ సెన్సేషన్ వరుణ్ సందేశ్ మరియు వితిక షెరు. హీరో, హీరోయిన్లుగా సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఈ జంట, బుల్లితెరపై బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్ దక్కించుకున్నారు.

Vithika Sheru Latest Cute Video
బ్లూ హాట్ బిగ్‌బాస్ బ్యూటీ..
జంటగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తమదైన స్టైల్లో ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. వరుణ్ సంగతి అటుంచితే, వితిక ఫ్యాషన్‌కి కేరాఫ్ అడ్రస్. హౌస్‌లో వున్నప్పుడు కూడా చాలా హుందాగా, అందంగా డ్రస్ చేసుకునేది. ఆమె డ్రస్ సెన్స్‌కి మెచ్చి ఆమెకు ఫ్యాన్స్ అయిపోయిన వాళ్లు చాలా మందే అంటే అతిశయోక్తి అనిపించదేమో.
బిగ్‌బాస్‌కి ముందు హీరోయిన్‌గా సెలెక్టివ్‌గా సినిమాలు చేసిన వితిక షెరు, బిగ్‌బాస్ తర్వాత కొన్ని రోజులు సినిమాల్లో కనిపించలేదు. ఈ మధ్యనే మళ్లీ సినిమాల్లో కనిపిస్తోంది. ‘పెళ్లి సందD’ సినిమాలో శ్రీలీలకు అక్కగా కనిపించింది.

Vithika Sheru Latest Cute Video
మళ్లీ హీరయిన్‌గా ట్రై చేయాలనుకుంటుందో ఏమో కానీ, సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా బ్లూ కలర్ గగ్రా చోళీ వేసుకుని అందంగా ఫోటోలకి పోజిచ్చింది వితిక షెరు.