Vishwaksen : శ్రీరామ్, ర‌విల‌పై విశ్వ‌క్ సేన్ సెటైర్స్‌.. స‌పోర్ట్‌గా స‌న్నీ ఫ్యాన్స్

Vishwaksen : బుల్లితెర బిగ్ గేమ్ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం రోజురోజుకి ర‌స‌వత్త‌రంగా మారుతుంది. ఈ షోని సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా ఫాలో అవుతున్నారు. సింగర్లు, బుల్లితెర తారమణులు బిగ్ బాస్ షోను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఎందుకంటే ఆ కెటగిరీల్లోంచే ఎక్కువ మంది బిగ్ బాస్ షోకు వెళ్తుంటారు.

TheNewsQube-
vishwaksen supports sunny and satire on anchor ravi sree ramachandra
vishwaksen supports sunny and satire on anchor ravi sree ramachandra

తాజాగా విశ్వక్ సేన్ ఈ బిగ్ బాస్ షో వివాదాల్లోకి వచ్చాడు. సన్నీకి మద్దతుగా పోస్ట్‌లు పెడుతూ.. రవి, శ్రీరామచంద్రలను కించపరిచాడు. విశ్వక్ సేన్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటాడు. ప్రతీ సినిమా విడుదలకు ముందు ఏదో ఒక వివాదాన్ని తట్టి పైకి లేపడం, కొన్ని రోజులు వార్తల్లో నిలవడం విశ్వక్ సేన్‌కు అలవాటే.

vishwaksen supports sunny and satire on anchor ravi sree ramachandra
vishwaksen supports sunny and satire on anchor ravi sree ramachandra

ఫలక్ నుమా దాస్ సినిమా సమయంలో అయితే విజయ్ దేవరకొండతో పోల్చుకోవడం, విజయ్ ఫ్యాన్స్ విశ్వక్ సేన్‌ను ఎలా ఆడుకున్నారో అందరికీ తెలిసిందే.పాగల్ అంటూ ఈ మధ్యే బోల్తా కొట్టేశాడు విశ్వక్ సేన్. అలాంటి ఈ హీరో ఇప్పుడు తాపీగా బిగ్ బాస్ షోను చూస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో శ్రీరామచంద్ర, రవిలపై సెటైర్లు వేశాడు.

శ్రీరామచంద్ర అటూ ఇటూ తిరుగుతూ ఉంటే షుగర్ వచ్చిందేమో అని కౌంటర్ వేశాడు. ఇక రవి మీద ఓవర్ స్మార్ట్ షుగర్ అంటూ కౌంటర్లు వేశాడు. దీంతో శ్రీరామచంద్ర, రవి అభిమానులు విశ్వక్ సేన్‌ను ఆడుకుంటున్నారు. సన్నీ అభిమానులు విశ్వక్ సేన్ తరుపున రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు.

విశ్వక్ సేన్‌కు డయాబెటిక్స్ వచ్చిందంటూ ఓ మీమ్ కూడా నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఆ మీమ్ మీద విశ్వక్ సేన్ పరుష పద జాలాన్ని వాడినట్టు కూడా కనిపిస్తోంది. మొత్తానికి విశ్వక్ సేన్ మాత్రం గాలికి పోయే దాన్ని తగిలించుకున్నట్టుంది.