Vishwak Sen- Arjun : అర్జున్ కు డబ్బులిచ్చారా.. విశ్వక్ సమాధానం ఇదే..!
NQ Staff - March 19, 2023 / 05:03 PM IST

Vishwak Sen- Arjun : టాలీవుడ్ లో యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే ఆయన సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఆయన హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన నటించిన మూవీ దాస్ కా ధమ్కీ. ఈ మూవీని ఆయనే దర్శకత్వం చేస్తున్నాడు.
ఈ మూవీ మార్చి 22న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ మూవీని ప్రమోట్ చేస్తున్నాడు. అయితే గతంలో ఆయన ఈ మూవీ కంటే ముందు అర్జున్ సర్జా దర్శకత్వంలో ఓ మూవీ చేయాల్సి ఉంది. అందులో ఆయన కూతురు హీరోయిన్ గా కూడా తీసుకున్నారు.
ఆ సినిమా క్యాన్సిల్..
కానీ కొన్ని గొడవల కారణంగా ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. దంతో అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ ను తప్పుబట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో విశ్వక్ కు ఓ ప్రశ్న ఎదురైంది. అర్జున్ సినిమా క్యాన్సిల్ అయింది కదా.. దానికి మీరు తిరిగి డబ్బులు చెల్లించారా అని ఓ విలేకరి అడిగాడు.
దానికి విశ్వక్ స్పందిస్తూ.. నేను ఈ సమయంలో దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ మూవీకి, ఈ మూవీకి అసలు సంబంధం లేదు. నేను చాలామందిపై ఉన్న గౌరవంతోనే దాని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు విశ్వక్. ఆయన చేసిన కామెంట్లపై మీ స్పందన ఏంటో తెలియజేయండి.