vishwak sen counters baby movie director : బేబీ మూవీ దర్శకుడికి కౌంటర్ వేసిన విశ్వక్ సేన్.. అరవడం మానేయ్ అంటూ..!
NQ Staff - July 21, 2023 / 01:28 PM IST

vishwak sen counters baby movie director : విశ్వక్ సేన్ అంటేనే వివాదం అన్నట్టు ఆన ప్రవర్తన ఉంటుంది. గతంలో ఆయన స్టేట్ మెంట్లు చాలా వివాదాన్ని రాజేశాయి. అయితే ఇప్పుడు ఆయన చేసిన మరో ట్వీట్ సంచలనం రేపుతోంది. ఇంతకీ ఎవరిని ఉద్దేశించి ఆయన ఆ ట్వీట్ చేశాడో ఎవరికీ అర్థం కావట్లేదు. విశ్వక్ సేన్ ఏదో ఒక రీజన్ లేకుండా ఏదీ మాట్లాడడు.
అయితే ఇది బేబీ మూవీ దర్శకుడు సాయిరాజేష్ ను ఉద్దేశించే చేసినట్టు ఉందని అంటున్నారు. ఎందుకంటే ఆయన మొన్న సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. నేను కథ చెబుతానంటూ ఓ హీరో కనీసం వినలేదని.. నో చెప్పాడని అన్నాడు. కానీ ఆ హారో ఎవరనేది మాత్రం చెప్పలేదు.
ప్రశాంతంగా ఉందాం..
అయితే ఆ హీరో విశ్వక్ సేనేనా అని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన ట్వీట్ లో ఏముందంటే… నో అంటే నో అని.. ఇది మగాళ్లకు కూడా వర్తిస్తుంది అంటూ చెప్పాడు. కాబట్టి కూల్‌గా ఉంచుకుందాం, అరవడం మానుకుందాం. మనమందరం ఇక్కడ శాంతియుత వాతావరణంలో ఉన్నాము, కాబట్టి మనం విశ్రాంతి తీసుకోండి అంటూ తెలిపాడు.
అంటే తాను సినిమాను రిజెక్ట్ చేసినంత మాత్రాన ఆ విషయాన్ని పబ్లిక్ లో చెప్పాల్సిన అవసరం లేదని ఇలా ట్వీట్ చేశాడన్నమాట. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మరి దీనిపై సాయిరాజేష్ ఏమైనా స్పందిస్తాడో లేదో చూడాలి.