Vishnupriya: వ‌చ్చే జ‌న్మ‌లోనైన అలాంటి వాడే భ‌ర్త‌గా రావాలంటున్న హాట్ యాంక‌ర్

Vishnupriya: బుల్లితెర‌పై మాట‌లు, గ్లామ‌ర్‌తో సంద‌డి చేసే వారిలో విష్ణు ప్రియ ఒక‌రు. హాట్ యాంకర్‌గా విష్ణుప్రియకు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉంది. శ్రీముఖి, విష్ణుప్రియ కలిశారంటే అంతా సందడి వాతావరణం నెలకొనాల్సిందే. ఈ ఇద్దరూ ఆ మ‌ధ్య గోవాలో తడి అందాలను ప్రదర్శించి ఒక్కసారిగా షాక్‌కు గురి చేశారు.

Vishnupriya

పోవే పోరా అనే షోతో విష్ణుప్రియ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అంతకు ముందు యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఓ మోస్తరు క్రేజ్‌ను తెచ్చుకున్నారు. అయితే బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలు చేయడంతో ఎక్కువ ఫేమస్ అయ్యారు. చిన్నతనం నుంచీ యాక్టర్ లేదా యాంకర్ అవ్వాలనే కోరిక ఉండేదని విష్ణుప్రియ చెబుతుంటారు. కాస్త క్రేజ్ అందుకున్న త‌ర్వాత విష్ణు ప్రియ అందాల ఆర‌బోత పీక్స్‌లోకి వెళ్లింది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విష్ణు ప్రియ త‌ర‌చు హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారుకు మ‌తులు పోగొడుతుంటుంది. వెండితెర మీద హీరోయిన్‌గానూ విష్ణు ప్రియ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో అందాల ఆర‌బోత‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది.

Vishnupriya

ఇటీవ‌ల విష్ణు ప్రియ బుల్లితెర‌పై పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులతో ట‌చ్‌లో ఉంటుంది. అయితే ఈ అమ్మ‌డు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో సంభాషించింది. ఈ సందర్భంగా తనకు ఎలాంటి భర్త కావాలనే విషయాన్ని ఆమె వెల్లడించింది. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘ఆషికీ-2’ సినిమాలో హీరోగా నటించిన ఆదిత్య రాయ్ కపూర్ లాంటి భర్త తనకు కావాలని విష్ణుప్రియ కోరుకుంది.

ఈ జన్మలో కాకపోయినా.. వచ్చే జన్మలో అయినా అలాంటి భర్త తనకి దక్కితే ఎంతో సంతోషిస్తానని ఆమె స్పష్టం చేసింది. మ‌రి విష్ణు ప్రియ‌కు ఆదిత్య రాయ్ క‌పూర్‌లో అంత‌గా ఏం న‌చ్చిందో మ‌రి. మ‌రి ఆమె కోరిక‌ను త్వ‌ర‌లోనే తీరాల‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.