VISHNU VISHAL: క్రీడాకారిణితో హీరో మెహందీ వేడుక‌.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

గ‌త ఏడాది నుండి క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ప‌రిశ్ర‌మ‌ను ఎంత‌గా వ‌ణికిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌రోనా వ‌ల‌న చాలా మంది సినీ ప‌రిశ్ర‌మ‌లు మృత్యువాత ప‌డ్డారు. మరి కొంద‌రు ఆసుప‌త్రిలో చికిత్స పొందారు. ఈ వైర‌స్ వ‌ల‌న ఫంక్ష‌న్స్ కూడా ఆగిపోయాయి. కొంద‌రు స్టార్స్ మాత్రం ఏదో నామ‌మాత్రంగా పెళ్లి పీట‌లెక్కారు. రానా, నితిన్, దిల్ రాజు, నిఖిల్, కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక‌లు సాదాసీదాగా పెళ్లి వేడుక‌ను జ‌రుపుకున్నారు. ఈ ఏడాది కూడా కొంద‌రు సెల‌బ్రిటీలు తాము ఇష్ట‌ప‌డిన వారితో పెళ్లి పీట‌లెక్కారు. ఇప్పుడు ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ ప్లేయర్ గుత్తా జ్వాల‌, త‌మిళ హీరో విష్ణు విశాల్ పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ద‌మ‌య్యారు.

కొన్నాళ్లుగా విష్ణు విశాల్- గుత్తా జ్వాల‌లు ప్రేమ‌లో ఉండగా, వారి వివాహాన్ని ఏప్రిల్ 22న జ‌రిపేందుకు ముహూర్తం నిర్ణ‌యిచారు. ఈ నేప‌థ్యంలో గ‌త మూడు రోజులుగా పెళ్లి వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రుగుత‌న్నాయి. మెహందీ వేడుక‌, బ్యాచిల‌ర్ పార్టీ వేడుక జ‌రుపుకంటూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. గ‌త రాత్రి మెహందీ ఫంక్ష‌న్ జ‌ర‌గ‌గా, ఈ వేడుక‌కు ఇరు వ‌ర్గాల‌కు చెందిన కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ వేడ‌క‌లో గుత్తా జ్వాల ప‌సుపు రంగు లెహంగాలో మెరిసిపోగా, న‌లుపు రంగు కుర్తాలో విష్ణు విశాల్ సంద‌డి చేశారు. ప్రస్తుతం జ్వాల-విశాల్‌ల మెహందీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కోవిడ్ కార‌ణంగా వేడుక‌ను సాదాసీదాగా జ‌రుపుకుంటున్నారు. ఉగాది ప‌ర్వ‌దినాన త‌మ ల‌గ్న పత్రిక‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు విష్ణు విశాల్. గుత్తా జ్వాల‌-విష్ణు విశాల్ ఇద్ద‌రికి ఇది రెండో వివాహం కాగా, విష్ణు విశాల్ 2010లో ర‌జ‌నీ న‌ట‌రాజ‌న్‌ను వివాహం చేసుకున్నాడు. 2018లో అనివార్యకార‌ణాల వ‌ల‌న విడాకులు ఇచ్చారు. ఇక గుత్తా జ్వాల కూడా 2005లో చేత‌న్ ఆనంద్ అనే క్రికెట‌ర్‌ను వివాహం చేసుకోగా, 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. విష్ణువిశాల్- గుత్తా జ్వాల క‌ల‌యిక ఎప్పుడు జ‌రిగింది అంటే విశాల్ సోద‌రి పెళ్లిలో తొలిసారి క‌ల‌వ‌గా అప్ప‌టి నుండి ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ కొన‌సాగి ఇప్పుడు పెళ్లి పీట‌ల వ‌ర‌కు వ‌చ్చింది.

 

Advertisement