Vishnu Priya విష్ణు ప్రియ.. ఈ అమ్మడు బుల్లితెర ప్రేక్షకులకి చాలా సుపరిచితం. పోవే పోరా అనే షోతో బాగా పాపులర్ అయిన విష్ణు ప్రియ ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ దక్కించుకుంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ కి చెందిన విష్ణు ప్రియ నటిగా కెరీర్ ప్రారంభించారు. 1990లో పుట్టిన విష్ణు ప్రియ ఏజ్ థర్టీ ప్లస్ కాగా, గతంలో కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశారు.

వెండితెరపై సరైన అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో కనిపించారు. పోవే పోరా షోలో యాంకరింగ్ చేసే అవకాశం దక్కడం, ఆమె కెరీర్ కి బ్రేక్ దొరికింది. ఇక ఆ షో ఆగిపోవడంతో మళ్లీ అలాంటి షోస్ ఎప్పుడు ఈ అమ్మడు చేయలేదు.
తాజాగా ఆహా కోసం ది బేకర్ అండ్ బ్యూటీ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఇందులో విష్ణు ప్రియ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా తన యాంకరింగ్ గురించి సంచనల కామెంట్స్ చేసింది విష్ణుప్రియ. సరిగ్గా చేయలేకే ఇక్కడికి వచ్చాను అని పేర్కొంది. పోరా పోవే షో మళ్లీ రాదా, యాంకరింగ్ చూడలేమా అని అడగ్గా, దానికి స్పందించిన విష్ణు.. దాని ఆన్సర్ దేవుడిని అడగండని చెప్పింది.
ఇప్పట్లో అయితే ఆ అవకాశం రాకపోవచ్చు. నాకు నత్తి ఉంది, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. తెలుగులో ఇక్కడ నేర్చుకొని డైలాగులు చెప్పడం చాలా కష్టం. ఇప్పటి వరకు నన్ను ఆదరించిన వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని విష్ణు ప్రియ పేర్కొంది.
బేకరీ నిర్వహించే మిడిల్ క్లాస్ యువకుడు విజయ్.. మహి (విష్ణు ప్రియ)తో కలిసి ఓ అన్-హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటాడు. అటు వైపు ఫిల్మ్ స్టార్ ఐరా వాసిరెడ్డి(టీనా)కి రీసెంట్గా తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అవుతుంది. అసలు విజయ్, ఐరా ఎలా కలిశారా.? ఆ తర్వాత వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏంటి.? చివరికి ఏమైందన్నది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ..