Vishnu Priya : విష్ణు ప్రియ: నాకేమంత టాలెంట్ లేదు కానీ, ఆఫర్లు వస్తున్నాయ్ ఎందుకంటే.!

NQ Staff - September 15, 2022 / 08:35 PM IST

158840Vishnu Priya : విష్ణు ప్రియ: నాకేమంత టాలెంట్ లేదు కానీ, ఆఫర్లు వస్తున్నాయ్ ఎందుకంటే.!

Vishnu Priya : బుల్లితెర యాంకర్ విష్ణుప్రియకు తనను యాంకర్ అని పిలవడం అస్సలు ఇష్టముండదట. అవును నిజమే, సోషల్ మీడియాలో విష్ణు ప్రియ డాన్సర్‌గా, మోడల్‌గా సెన్సేషనల్. బహుశా అందుకేనేమో యాంకర్ అనిపించుకోవడం ఇష్టముండదేమో విష్ణు ప్రియకు అనుకుంటున్నారా.?
అయితే కాస్త ఆగండి. ఎందుకలా అనిపించుకోవడం విష్ణు ప్రియకు నచ్చదో రీజన్‌తో సహా చెప్పేసింది. విష్ణు ప్రియకు తెలుగు సరిగ్గా మాట్టాడడం రాదంటోంది. అలాగే, తనేమంత పెద్ద అందగత్తెని కాదని కూడా ఒప్పేసుకుంటోంది. అలాంటప్పుడు తనను యాంకర్ అని ఎందుకు పిలవాలి.? అని ప్రశ్నిస్తోంది విష్ణు ప్రియ. కన్విన్సింగ్‌గానే వుంది కదా.

విష్ణు ప్రియ అందాల రాక్షసి కాదా.? ఆమెకంత టాలెంట్ లేదా.?

Vishnu Priya Says Find Success Only If You Lucky

Vishnu Priya Says Find Success Only If You Lucky

ఇంకా చాలా చెబుతోందండోయ్ ఈ అందాల రాక్షసి. తన కన్నా చాలా బాగా తెలుగు మాట్లాడేవాళ్లు, టాలెంట్ వున్న వాళ్లు చాలా మందే వున్నారు. కానీ, వాళ్లెవరికీ సరైన అవకాశాలు దక్కడం లేదు. కానీ యాంకర్‌గా నాకు ఆ అవకాశం దక్కింది. అందుకు కారణం నా టాలెంట్, నా అందం కాదు, నా లక్ అంటోంది విష్ణు ప్రియ.

అవును నిజమే, లక్కుంటేనే సక్సెస్ దొరుకుతుంది. ఎంత కష్టపడినా, ఇంకెంత టాలెంట్ వున్నా, ఆవ గింజతైనా అదృస్టం లేకపోతే ఎలాంటి సక్సెస్ చవి చూడలేం. విష్ణు ప్రియ నిజమే చెప్పింది. ఆ అదృష్టం వుండడం వల్లే తను ఈ స్థాయిలో వున్నానని అందుకే తనకు యాంకర్ అనిపించుకోవడం నచ్చదనీ, ఆ పేరుకు తాను అర్హురాలు కాదనీ చెబుతోంది విష్ణు ప్రియ.

నిజమే, నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలన్నా గట్స్ వుండాలి కదా. విష్ణు ప్రియకు ఆ గట్స్ వున్నాయ్‌లే పో.! ప్రస్తుతం విష్ణు ప్రియ బుల్లితెరతో పాటూ, ఓటీటీ తెరపైనా సత్తా చాటుతోంది. షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లు గట్రాతో బిజీగా గడుపుతోంది. అలాగే ‘జరీ జరీ పంచెకట్టు..’ అనే ఓ వీడియో ఫోక్ సాంగ్‌లో నటించింది ఇటీవల విష్ణుప్రియ.