Vishnu Priya: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌నున్న విష్ణు ప్రియ‌… ఇందులో నిజ‌మెంత‌?

Vishnu Priya: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం ఐదో సీజ‌న్ జ‌రుపుకుంటుంది. 19 మంది కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ సీజ‌న్ 5 మొద‌లు కాగా, ఇప్ప‌టికే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం హౌజ్‌లో 16మంది స‌భ్యులు ఉన్నారు. అయితే ఈ వారంలో ఒక యాంక‌ర్ వైల్డ్ కార్ట్ ఎంట్రీ ఇస్తుంద‌ని జోరుగా ప్రచారం నడుస్తుంది.

Vishnu Priya as Wild Card Entry in Biggboss 5
Vishnu Priya as Wild Card Entry in Biggboss 5

విష్ణు ప్రియ అని కొంద‌రు అంటుండ‌గా, మ‌రి కొంద‌రు వ‌ర్షిణి అని చెప్పుకొస్తున్నారు. అయితే విష్ణు ప్రియ ఎంట‌ర్ అయ్యే ఛాన్స్ లేద‌ని వార్త‌లు వస్తున్నాయి. అందుకు కార‌ణం తనకు బిగ్‌బాస్‌ కాన్సెప్టే నచ్చదని ఎన్నోసార్లు బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వెల్లడించింది విష్ణుప్రియ. ఎన్ని కోట్లు ఇస్తానన్నా, ఎన్ని సీజన్ల నుంచి పిలుపు వచ్చినా షోలో ఎంట్రీ ఇచ్చేదే లేదని పలు ఇంటర్వ్యూల్లో కుండ బద్ధలు కొట్టి చెప్పేసింది.

విష్ణు ప్రియ షోలోకి రావడం కేవలం అపోహ అంటున్నారు ఆమె అభిమానులు. బిగ్‌బాస్‌ అంటేనే గిట్టదన్న విష్ణుప్రియ షోలో పాల్గొనే అవకాశమే లేదని బల్లగుద్ది చెప్తున్నారు. యాంకర్‌ విష్ణు ప్రియా సోషల్‌ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె పంచుకునే హాట్‌ డాన్స్ వీడియోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ఆమె తన ఘాటైన అందాలతో కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విసయం తెలిసిందే.