Vishal: షూటింగ్‌లో ప్ర‌మాదం.. కుప్ప‌కూలి ప‌డ్డ స్టార్ హీరో

Vishal: ఇప్ప‌టి హీరోలు డూప్స్ లేకుండా షూటింగ్ చేయ‌డంతో ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. వ‌రుస ప్ర‌మాదాలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ రిస్కీ స్టంట్స్ చేయ‌డం మాత్రం ఆప‌డం లేదు. తాజాగా త‌మిళ స్టార్ హీరో విశాల్ సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గ‌తంలోను ప‌లుమార్లు గాయ‌ప‌డ్డ విశాల్ ఈ సారి మాత్రం ఎక్కువ‌గా గాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనే సినిమా చేస్తున్నాడు విశాల్. యాక్షన్ సన్నివేశం చిత్రీకరించే సమయంలోనే గాయాలపాలయ్యారు. శరవణన్ డైరెక్షన్లో నటిస్తున్న ఈ మూవీ.. కరోనా విరామం తర్వాత షూటింగ్ జరుపుకుంటోంది. తుది ద‌శ‌కు చిత్రీక‌ర‌ణ చేరుకోగా, భారీ యాక్ష‌న్ సీన్ చిత్రీక‌రించ‌డం కోసం సెట్ వేశాడు. ఫైట్ మాస్టర్ గూస్ బంప్స్ అయ్యే స్టంట్లు కంపోజ్ చేశారు. అయితే.. ఇందులో ఒక స్టంట్ చేసే క్రమంలో అంచనా మిస్సవడంతో.. విశాల్ గాయపడ్డారు.

విల‌న్ బ‌లంగా విసిరి వేయ‌డంతో విశాల్ గోడకు వెళ్లి తగిలాడు. దీంతో విశిల్ వెన్నుకు బ‌లంగా దెబ్బ త‌గిలింది. దీంతో వెంట‌నే కుప్పకూలాడు. చిత్ర యూనిట్ వెంట‌నే స్పందించి విశాల్‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న వెన్నుకు కాస్త బ‌ల‌మైన దెబ్బ తగిలింద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు.

గతంలోనూ విశాల్ కు ఇదేవిధంగా గాయపడ్డాడు. ఫైట్ సీన్ లో నటుల మధ్య కో-ఆర్డినేషన్ మిస్ మ్యాచ్ కావడంతో.. విశాల్ తలకు కన్ను ప్రాంతంలో గాయాలయ్యాయి. ఇప్పుడు మరోసారి గాయపడడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎనిమీ’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత మరోసారి వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఇది హీరో విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ.

‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌ మృణాళిని రవి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో నటించాడు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇటీవ‌ల‌‘ఎనిమీ’ మూవీ షూటింగ్ పూర్తి కావ‌డంతో విశాల్ ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనే షూటింగ్‌లో పాల్గొన్నాడు.