Vishal: ఇల్లు కోసం దాచుకున్న డ‌బ్బు పునీత్ కోసం ఖ‌ర్చు పెడ‌తా: విశాల్

Vishal:క‌న్న‌డ ప‌వర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణించి అప్పుడే 20 రోజులు అవుతుంది. ఆయ‌న మ‌రణ వార్త ఇప్ప‌టికీ జీర్ణించుకోలేని విధంగా ఉంది. పునీత్‌ మరణంతో కన్నడ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా మంగళవారం బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో పునీత్‌ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

vishal emotion about puneeth death
vishal emotion about puneeth death

ఈ సభలో పాల్గొన్నతమిళ సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌..పునీత్‌ను గుర్తుచేసుకొని ఎమోషనల్‌ అయ్యారు. ‘పునీత్‌ బదులు నేను చనిపోయినా బాగుండేది. ఇదే వేదికపై రాజకుమార​ మూవీ 100రోజుల వేడుక జరిగింది. ఇప్పుడు పునీత్ శ్రద్ధాంజలి ఇక్కడే జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నా.. కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చింది’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

పునీత్‌తో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకొని.. ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకున్నారు విశాల్ ‘‘పునీత్‌ను తలచుకుంటే చిరునవ్వుతో కూడిన అతని ముఖం నా కళ్ల ముందే మెదులుతోంది. ఆయన మరణవార్త తెలియగానే కన్నీళ్లు ఆగలేదు. ఆ వార్తను జీర్ణించుకోవడానికి నాకు రెండు రోజులు సమయం పట్టింది.

vishal emotion about puneeth death3
vishal emotion about puneeth death3

పునీత్‌తో నాకు అంత అనుబంధం లేదు. కానీ, ఆయనకు నేనూ ఒక అభిమానినే. పునీత్‌.. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేవాడని మరణించేవరకూ ఎవ్వరికీ తెలీదు. అలాంటి గొప్ప వ్యక్తి.. చేసిన సేవా కార్యక్రమాల్లో నేనూ భాగం కావాలనుకుంటున్నాను. అందులో భాగంగా పునీత్‌ చదివిస్తున్న 1800 మంది పిల్లలను ఇకపై నేను చదివిస్తాను.

వాళ్ల చదువులకు అయ్యే ఖర్చు నేను భరిస్తాను. నిజం చెప్పాలంటే.. నాకు ఇప్పటివరకూ సొంత ఇల్లు లేదు. మా తల్లిదండ్రుల ఇంటిలోనే ఉంటున్నాను. నా సొంతింటి కలను నెరవేర్చుకోవడం కోసం ఇప్పటివరకూ డబ్బు కూడబెట్టుకున్నాను. ఆ డబ్బునే ఇప్పుడు పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తాను. పునీత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని విశాల్‌ అన్నారు