Virat Kohli: రోహిత్‌కి కెప్టెన్సీ ప‌గ్గాలు.. స్వ‌యంగా ప్ర‌కటించిన విరాట్‌

Virat Kohli: గ‌త కొద్ది రోజులుగా టీమిండియా కెప్టెన్సీ విష‌యంలో చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయి. టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత రోహిత్ వ‌ర్మ ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌కి కెప్టెన్‌గా ఉంటార‌ని , కోహ్లీ టెస్ట్ మ్యాచ్‌కి కెప్టెన్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తార‌ని చెప్పుకొచ్చారు. మెగా టోర్నీ ముగిసిన తర్వాత కోహ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీని వదులుకోనున్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే ఈ విషయమై కోహ్లీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి సమాచారామిచ్చాడని పేర్కొంది.

Virat Kohli

ప‌రిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలని స్వయంగా కోహ్లీనే.. బీసీసీఐ సూచించాడని ఆ ప‌త్రిక పేర్కొన‌గా, ఇప్పుడ‌దే నిజ‌మైంది. గ‌త 9 సంవ‌త్స‌రాల నుండి మూడు ఫార్మాట్స్‌లో ఆడుతూ అలానే కెప్టెన్‌గా ఐదారు సంవ‌త్స‌రాల పాటు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాను. ఈ క్ర‌మంలో ప‌ని ఒత్తిడి ఎక్కువైంది. అందుకే టీ 20 కెప్టెన్‌గా రోహిత్‌ని నియ‌మించాల‌ని జైషా, బీసీసీఐ అధ్య‌క్షుడు, గంగూలితో పాటు ఇత‌ర సెల‌క్టర్స్‌తో చ‌ర్చించాను.

రోహిత్‌, ర‌విశాస్త్రితో కూడా మాట్లాడాను.అంద‌రు కూడా దీనికి స‌మ్మ‌తించారు. టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత జ‌ర‌గ‌నున్న టీ 20ల‌కు రోహిత్ కెప్టెన్‌గా ఉంటాడు. ఇన్నాళ్ల నా క్రికెట్ ప్ర‌యాణంలో నాతో పాటు న‌డిచి, న‌న్ను స‌పోర్ట్ చేసిన వారంద‌రికి ధ‌న్య‌వాదాలు. ఇండియన్ క్రికెట్‌తో పాటు ఇండియ‌న్ టీంకు మ‌రెన్నో సేవ‌లు చేసే క్ర‌మంలో ఈ నిర్ణయం తీసుకున్నాను అని కోహ్లీ తెలియ‌జేశారు.

Virat Kohli

2014లో మహేంద్రసింగ్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీని అందుకున్న విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత 2017లో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కానీ.. అతని కెప్టెన్సీలో ఇప్పటి వరకూ కనీసం ఒక్క ఐసీసీ టైటిల్‌ని కూడా భారత్ జట్టు గెలవలేదు. దాంతో.. గత రెండేళ్ల నుంచి కెప్టెన్సీ విభజనపై చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు బ్యాట్స్‌మన్‌గా కూడా కోహ్లీ గత రెండు ఏళ్లుగా విఫలమవుతున్నాడు.

ఈ మ‌ధ్య ఫామ్ లేమితో స‌త‌మవుతున్న క్ర‌మంలో కోహ్లీని కెప్టెన్సీ నుండి త‌ప్పించాల‌నే వాద‌న ఎక్కువైంది. ర‌న్నింగ్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లీ.. గత రెండుళ్లుగా ఒక్క సెంచరీ బాదలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ చేసేందుకు, మునపటి ఫామ్ అందుకునేందుకు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణ‌యించుకున్నాడు.వ‌న్డే, టెస్ట్‌ల‌కు మాత్రం అత‌నే కెప్టెన్‌గా ఉంటాడు. టీ 20ల‌కు మాత్రం రోహిత్ కెప్టెన్సీ బాధ‌త్య‌ల‌ను అందుకోనున్నాడు.

భారత పరిమిత ఓవర్ల సిరీస్‌లకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంచుకోవడం సరైన నిర్ణయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ‘రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఖచ్చితంగా దుమ్మురేపుతోంది. ప్రపంచ క్రికెట్‌లో మరో స్థాయికి చేరుకుంటుంది.’అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.