KOHLI: వామిక‌ను ఎందుకు చూపించ‌డం లేదంటూ నెటిజ‌న్ ప్ర‌శ్న‌.. స్ట‌న్నింగ్ స‌మాధానం ఇచ్చిన కోహ్లీ

బాలీవుడ్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో విరాట్ కోహ్లీ- అనుష్క శ‌ర్మ ఒక‌రు. పెళ్లై రెండేళ్లు దాటిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఖాళీ స‌మ‌యాల్లో చెట్టాప‌ట్టాలు వేయ‌డం, పార్టీల‌లో ఎంజాయ్ చేస్తూ వ‌చ్చిన ఈ జంట కొద్ది రోజుల క్రితం పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. చిన్నారిని సంతోషంగా త‌మ కుటుంబంలోకి ఆహ్వానించిన ఈ జంట పాప‌కు వామిక అనే పేరు పెట్టారు. అయితే వామిక‌ను తీసుకొని ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు హాజ‌రైన కోహ్లి జంట ఎక్క‌డ కూడా ఆమె ఫేస్ రివీల్ చేయ‌లేదు. ఎవ‌రికి క‌నిపించకుండా జాగ్రత్త ప‌డ్డారు కూడా. అయితే తాజాగా కోహ్లీ అభిమానులతో క్వశ్చన్ అవర్ నిర్వ‌హించ‌గా, ఓ నెటిజ‌న్ వామిక ముఖాన్ని ఎందుకు చూపించడం లేదంటూ ప్ర‌శ్నించాడు.

ఇప్పటి వరకూ వామికను ఎందుకు చూపించలేదు? ఆ చిన్నారి ఫొటోను మేం చూడొచ్చా? అని ఓ నెటిజన్ అడిగారు. దానికి.. ఉద్దేశపూర్వకంగానే తమ కూతురి చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయలేదని సమాధానం ఇచ్చాడు కోహ్లీ. దానికి కారణం ఏంటన్నది కూడా చెప్పాడు. సోషల్ మీడియా అంటే ఏంటన్నది తన కూతురికి అర్థమైన రోజున అవగాహన కలిగిన రోజున తనే షేర్ చేస్తుందని చెప్పాడు. వామిక త‌న ఫీలింగ్స్‌ని సొంతంగా షేర్ చేసే రోజు వ‌ర‌కు ఆమెను సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంచాల‌ని నిర్ణ‌యించుకున్నాను. నా భార్య అనుష్క నేను క‌లిసి ఈ నిర్ణ‌యం తీసుకున్నాం అని కోహ్లీ అన్నాడు.

క్వ‌శ్చన్ ఆన్స‌ర్ సెష‌న్‌లో ఎంతో ఓపిక‌గా స‌మాధానాలు ఇచ్చిన కోహ్లీ.. మీ కూతురి పేరులో ఉన్న అర్ధం ఏంట‌ని అడ‌గ్గా , దానికి వివ‌ర‌ణ ఇచ్చాడు. వామిక అంటే.. దుర్గామాతకు ఉన్న మరోపేరు అని చెప్పాడు కోహ్లీ. ఈ విధంగా తన కూతురికి సంబంధించిన విషయాలను వెల్లడించాడు. ఇదే విషయాన్ని గతంలోనూ ఓ సారి చెప్పారు కోహ్లీదంపతులు. ఇక ఈ ఏడాది జ‌ర‌గాల్సిన ఐపీఎల్ కార్య‌క్ర‌మం మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డంతో ఇప్పుడు దుబాయ్‌లో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంత‌క‌ముందు న్యూజిలాండ్‌తో వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్ షిప్ ఆడ‌నున్నారు కోహ్లీ టీం. ఇందుకోసం లార్డ్స్‌కు బ‌య‌ల‌దేర‌నుంది కోహ్లీ బృందం.