Viral Video: బ‌రాత్‌లో త‌న డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన పెళ్లి కూతురు.. వైరల్ కావ‌డంతో ఫుల్ ఖుష్‌

Viral Video: ఒక్కోసారి కొన్ని వీడియోలు ఇట్టే వైర‌ల్ అవుతుంటాయి. ఏదో ప‌లు వేడుక‌ల‌లో స‌ర‌దాగా చేసే ప‌నులు మ‌న చుట్టు ప‌క్క‌ల వారినే కాదు ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షిస్తుంటాయి. రీసెంట్‌గా మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన నవవధువు సాయి శ్రీయ అప్పగింతల్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది.

ఇటీవల బాగా హిట్‌ అయిన ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌లోని గాయని మోహన భోగరాజు పాడిన ‘బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..’ పాటకు కట్టుకున్న భర్త ముందు ఆడి కొత్త జీవితంలోకి భర్తను మనసారా ఆహ్వానించింది. పాటలోని పదాలకు అనుగుణంగా స్టెప్పులేస్తూ నూతన వరుడిని ఆకట్టుకుంది. ‘పట్టుచీరనే గట్టుకున్నా.. గట్టుకున్నుల్లో గట్టుకున్నా’అంటూ తన సింగారాన్ని ఒలకపోసింది. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..’అంటూ చేతిని తన భర్తకందించింది.

‘నువ్వు నన్నేలుకున్నావురో దండ మెల్లోన ఏస్తానురో.. నేను నీ యేలు వట్టుకోని మల్లె జల్లోన ఎడతానురో’అంటూ ఆనందం వ్య‌క్తం చేస్తూ.. ‘మంచి మర్యాదలు తెలిసినదాన్ని.. మట్టి మనుషుల్లోనా పెరిగినదాన్ని’అంటూ నిష్కపటత్వాన్ని ఆవిష్కరించింది. ‘నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో.. మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో.. ఏడు గడపలల్ల ఒక్కదాన్నిరయ్యో.. మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో, నేను ప్రాణమయ్యో..’అంటూ ఫ్యామిలీతో అనుబంధం గురించి తెలిపింది. ‘ఎన్ని మారాలు జేస్తు ఉన్నా నన్ను గారాలు జేసుకొని.. చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను’అంటూ త‌న‌ని ఎంత గారాబంగా చూసుకున్నారో పేర్కొంది.

అయితే ఈ వీడియోకి ఇంత రెస్పాన్స్ రావ‌డం ప‌ట్ల వ‌ధూవ‌రులు ఇద్ద‌రు సంతోషం వ్య‌క్తం చేశారు. పెళ్లికి స్పెష‌ల్ గుర్తుగా ఉండాల‌ని చేసిన డ్యాన్స్ కు ఇంత గొప్ప స్పంద‌న రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ఈ క‌పుల్ అంటున్నారు. జాన‌ప‌దాలు అంటే నా భ‌ర్త‌కు చాలా ఇష్టం. అందుకోసమనే ఆ సాంగ్‌ని ప్ర‌జెంట్ చేశా. ఇది ఫ్యామిలీ మ‌ధ్య ఉంటుంద‌ని అనుకున్నా కాని ఇంత రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు అని వ‌ధువు పేర్కొంది.

యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సాంగ్‌కు ప‌లువురి నుండి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి అని వ‌రుడు పేర్కొన్నాడు.ఐఏఎస్ కూడా విష్ చేశారని తెలిపిన ఆయ‌న చాలా ఆనందంగా ఉంద‌ని అన్నాడు.