VIKRAM VEDA: ఇంట్రెస్టింగ్ కాంబినేష‌న్.. బ్లాక్ బ‌స్ట‌ర్ రీమేక్‌లో చిరు- నాగార్జున‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఎక్కువ‌గా మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాలు ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. చిన్న హీరోల‌తో పాటు స్టార్ హీరోలు సైతం మ‌ల్టీ స్టార‌ర్స్‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ చిత్రాల‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌డంతో టాలీవుడ్ లో క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్స్ రూపుదిద్దుకుంటున్నాయి. కొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. తాజ‌గా క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌కు సంబంధించిన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇది ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంది.

 

ఇప్పుడు త‌మిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన‌ ‘విక్రమ్ వేద’ రీమేక్ లో చిరంజీవి, నాగార్జున‌ కలిసి నటించే అవకాశాలు ఉన్నాయంటూ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. విక్ర‌మ్ వేద చిత్రంలో విజ‌య్ సేతుప‌తి- మాధ‌వ‌న్ క‌లిసి న‌టించారు. పుష్కర్ – గాయత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ ‘విక్రమ్’ గా మాధవన్.. గ్యాంగ్ స్టర్ ‘వేద’ పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తున్నారు.

ముందుగా విక్ర‌మ్ వేద రీమేక్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- ర‌వితేజ పేర్లు వినిపించాయి. ఆ త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ – రవితేజ అన్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి- నాగార్జున అంటున్నారు. విక్ర‌మ్ వేద చిత్రం తెలుగులో రీమేక్ కావ‌డం ప‌క్కా కాని అందులో న‌టించ‌బోయే హీరోలు ఎవ‌ర‌నే దానిపై మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టు రీమేక్‌లో చిరంజీవి- నాగార్జున క‌లిసి న‌టిస్తే ఈ చిత్రం ఇండ‌స్ట్రీని షేక్ చేయ‌డం ఖాయం. ప్ర‌స్తుతం చిరంజీవి ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత ప‌లు చిత్రాలు చేసేందుకు కూడా ద‌ర్శ‌కుల‌ని సిద్దం చేశారు. ఇక నాగార్జున బంగార్రాజు షూటింగ్ మొద‌లు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement