Vikram: విక్రమ్ సక్సెస్ .. కమల్ డబుల్ జోష్

NQ Staff - June 17, 2022 / 08:15 AM IST

Vikram: విక్రమ్ సక్సెస్ .. కమల్ డబుల్ జోష్

Vikram: లోకనాయకుడు కమల్ హాసన్ తన కెరీర్ లో ఇప్పటివరకూ సినిమాకు సినిమాకు మధ్య నాలుగేళ్ల గ్యాప్ ఎప్పుడూ ఇవ్వలేదు. యాక్టర్ గానే కాదు.. ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, లిరిసిస్ట్, సింగర్, టెక్నీషియన్ ఇలా ఏదో ఓ క్రాఫ్ట్తో తనదైన అవుట్పుట్నివ్వడానికే ప్రయత్నించేవాడు. కానీ వరుసగా డీలా పడేసిన డిజాస్టర్లు, కరోనా, పొలిటికల్ ఎంట్రీ కారణంగా సినిమాలను తెరకెక్కించలేకపోయాడు. విక్రమ్ ట్యాగ్ లైన్ లా ‘వన్స్ అపాన్ ఏ టైమ్’ ఆయనకి హిట్స్ ఉండేవి అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ లేటెస్ట్ గా లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన విక్రమ్ మూవీతో మరోసారి ఫామ్ లోకొచ్చాడు కమల్.

Vikram Success for Kamal Haasan

Vikram Success for Kamal Haasan


హీరోగానే కాదు.. ప్రొడ్యూసర్‌గా కూడా తనకి బాగా కలిసిరావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఆ సంతోషంలోనే దర్శకుడు లోకేష్ కి ఓ లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్‌కు పనిచేసిన 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకి తలా ఓ బైక్ కొనిచ్చాడు. రోలెక్స్ క్యారెక్టర్ తో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిన సూర్యకి స్వయంగా రోలెక్స్ వాచ్ ప్రజెంట్ చేసి మురిసిపోయాడు. ఇవే కాదు.. విక్రమ్ ప్రాఫిట్స్ తో ఇప్పటివరకూ తనకున్న అప్పులన్నీ తీర్చేస్తానని కూడా ప్రకటించాడు కమల్.

ఇక కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ మ్యాటర్ కాసేపు పక్కనబెడితే విక్రమ్ సక్సెస్ మన వెండితెర భారతీయుడికి సరికొత్త జోష్‌నిచ్చింది. మొన్నటివరకూ సెట్స్ పైనో, పేపర్ పైనో, డిస్కషన్ స్టేజ్ లోనో ఉన్న ప్రాజెక్టుల్ని త్వరగా పట్టాలెక్కించి ఆడియెన్స్ ముందుకు తేవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇండియన్ టూ, పాపనాశం టూ పాటు మళయాళ డైరెక్టర్ మహేష్ నారాయణన్(మాలిక్ ఫేమ్) తో ఓ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. గతంలో విశ్వరూపం, విశ్వరూపం టూ చిత్రాలకు మహేష్ నారాయణన్ ఎడిటర్ గా పనిచేయడంతో వీళ్లిద్దరికీ క్రియేటివ్ ర్యాపో బానే ఉందనీ, అవుట్ పుట్ కూడా అదిరిపోతుందని టాక్.

మరోవైపు 1992 లో శివాజీ గణేషన్ తో కలిసి నటించిన హిట్ మూవీ దేవర్ మగన్ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో చియాన్ విక్రమ్ కూడా ఓ ప్రధాన పాత్ర పోషించబోతున్నాడన్న గాసిప్ రావడంతో ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాని ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఇక విక్రమ్ మూవీ సీక్వెల్ ఎలాగూ రానే రానుంది. ఫహద్ ఫజిల్, విజయ్ సేతుపతి, సూర్య కూడా ఆ ప్రాజెక్ట్ లో ఉంటారని ఆల్రెడీ కన్ఫర్మ్డ్ గా తెలిసిపోవడంతో హైప్ ఆకాశాన్ని తాకేసింది.

మొత్తానికి విక్రమ్ సక్సెస్ ఇచ్చిన బూస్టప్ తో యాక్టర్ గా మళ్లీ తన విశ్వరూపాన్ని చూయించి ఫ్యాన్స్‌కు సీక్వెన్స్ గా పండగ సెలబ్రేషన్స్ ఇవ్వాలని గట్టిగానే డిసైడయ్యాడు బాక్సాఫీస్ నాయకుడు. మరి కమల్ వరుస సినిమాల ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుంది. ఎన్ని చిత్రాలు త్వరలోనే ఆడియెన్స్ ని అలరిస్తాయనేది వేచి చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us