NTR: ఎన్టీఆర్‌కు ముస్లిం టోపీ ఎందుకు పెట్టారో వివ‌ర‌ణ ఇచ్చిన రాజ‌మౌళి తండ్రి

NTR దక్షిణాదిలో భారీ మల్టీస్టారర్ చిత్రంగా రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ సినిమా కోసం యావ‌త్ సినీ ప్ర‌పంచం ఎదురు చూస్తుంది. కరోనా నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడుతూ ఎట్టకేలకు.. రెండు పాటలు మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ చిత్రం.

RRR

రీసెంట్‌గా రామ్ చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్‌ల పాట‌కు సంబంధించిన షూటింగ్ మొద‌లైంది. త‌ర్వాత పాట కోసం విదేశాల‌కు వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో జ‌క్కన్న తెర‌కెక్కిస్తుండ‌గా, ఇటీవ‌ల మూవీకి సంబంధించిన వీడియో ఒక‌టి విడుద‌ల కాగా, ఇది చిత్రంపై భారీ అంచ‌నాలు పెంచింది.

Rajamouli Brings His All Heroes For RRR Movie

మేకింగ్ వీడియో పేరుతో ఈ వీడియో విడుద‌ల కాగా, ఇందులో బీజీఎమ్, యాక్ష‌న్ స‌న్నివేశాలు రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కుమురం భీంగా నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్‌ పూర్తిచేశారు. ఇతర భాషలకి త్వరలోనే డబ్బింగ్‌ చెప్పనున్నారని చిత్ర బృదం తెలిపింది. అంతేకాదు పోస్ట్ పొడక్షన్ వర్క్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, విడుదల తేదీని ప్రకటించేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

RRR

ఆలియా భట్‌, ఒలివియా మోరీస్‌ నాయికలు. అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రల్లో కనిపించునున్నారు. సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ నుండి డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాజమౌళి తండ్రి, రచయిత కె.వి. విజయేంద్రప్రసాద్‌.. ఎన్టీఆర్ పాత్ర‌కు ముస్లిం పెట్ట‌డంపై వివ‌ర‌ణ ఇచ్చారు.

ఎన్టీఆర్‌కు సంబంధించిన వీడియో విడుద‌లైన‌ప్పుడు ఆయ‌న ముస్లిం గెట‌ప్‌లో క‌నిపించ‌డంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. చాలా మంది చ‌రిత్ర‌కారులు భీమ్‌కు ముస్లిం టోపీ పెట్ట‌డంపై మండి ప‌డ్డారు. భీమ్‌ వారసులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై ఆంగ్ల మీడియాతో మాట్లాడిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ .. ‘‘భీమ్‌ను పట్టుకోవాలని నైజాం ప్రభువులు ప్రయత్నించారు. వెంటాడారు. నైజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆ విధంగా చేశాడు. ముస్లిం యువకుడిగా మారాడు’’ అన్నారు.

అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్‌చరణ్‌ను పోలీస్‌గా చూపించడానికి ఓ కారణం ఉందని, వెండితెరపై ప్రేక్షకులకు అది సర్‌ప్రైజ్‌ ఇస్తుందని ఆయన అన్నారు. ఇద్దరు స్టార్స్‌తో సినిమాలు చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్న తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ రాశారట. ‘‘ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ స్టార్‌ ఇమేజ్‌ను, అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథ రాశాం’’ అని విజయేంద్ర ప్ర‌సాద్ పేర్కొన్నారు.