Vijayendra Prasad: పెళ్లి కూతురు పార్టీ అని పిలిచారు, ఇక్కడ ఏది లేదంటూ విజ‌యేంద్ర ప్రసాద్ కామెంట్స్

Vijayendra Prasad: రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ ర‌చయిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ బాహుబ‌లి సినిమాతో ఎంత పాపుల‌ర్ అయ్యారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఆర్ఆర్ఆర్ చిత్రానికి ర‌చ‌యిత‌గా ప‌ని చేశారు. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఓ షార్ట్ ఫిలిం కోసం మోడీగా క‌నిపించ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. అందుకే ఆయ‌న అంత‌లా గ‌డ్డం పెంచుతున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి.


Vijayendra Prasad Funny Speech in Pelli Kuthuru Party Movie Trailer Launch
Vijayendra Prasad Funny Speech in Pelli Kuthuru Party Movie Trailer Launch


క‌ట్ చేస్తే విజ‌యేంద్ర ప్ర‌సాద్ రీసెంట్‌ఘా అనీషా దామ‌, ప్రిన్స్‌, భావ‌న వ‌జపండ‌ల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న ‘పెళ్లికూతురు పార్టీ’ ట్రైల‌ర్ లాంచింగ్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌యిన ఆయ‌న మాట్లాడుతూ.. ” ‘పెళ్లి కూతురు పార్టీ’ అని పిలిస్తే.. ఒక్క‌డేదో పెళ్లి వాతావ‌ర‌ణం క‌నిపిస్తుందేమో అనుకున్నాను. కానీ అలాంటి వాతావ‌ర‌ణం క‌నిపించ‌లేదు. పోనీ పార్టీ ఏమైనా ఇస్తారేమో అనుకుంటే అదీ లేదు. అయితే మంచి ట్రైల‌ర్‌, సాంగ్స్‌తో మెప్పించారు. చాలా బావున్నాయి. సినిమా మంచి స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను” అని అన్నారు.


Vijayendra Prasad Funny Speech in Pelli Kuthuru Party Movie Trailer Launch
Vijayendra Prasad Funny Speech in Pelli Kuthuru Party Movie Trailer Launch


ద‌ర్శ‌కుడు అప‌ర్ణ మ‌ల్లాది మాట్లాడుతూ.. విజయేంద్ర ప్రసాద్‌గారు నాకు మెంట‌ర్‌, గురు, ఫ్రెండ్‌! ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. ఇదో రొమాంటిక్ కామెడీ, అడ్వెంచ‌ర్ జోనర్ మూవీ. ఫిమేల్ ప్రొటాగ‌నిస్ట్ సినిమా. అనీషా దామా ఇందులో మెయిన్ పాత్ర చేశారు. ‘మ‌హ‌ర్షి, ఓ బేబి, గీత గోవిందం’ చిత్రాల్లో ఈమె న‌టించారు. ఆమెకు జోడీగా ప్రిన్స్ యాక్ట్ చేశారు అని చెప్పారు.


అనీషా దామ మాట్లాడుతూ, ”ఏడాది ముందు ఈ ‘పెళ్లికూతురు పార్టీ’ జ‌ర్నీని స్టార్ట్ చేశాం. నాపై న‌మ్మ‌కంతో నాకు మెయిన్ లీడ్ అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ అప‌ర్ణ‌గారికి, నిర్మాత స్వామిగారికి థాంక్స్‌” అని అన్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ లో జనం ముందుకు తీసుకురాబోతున్నట్టు నిర్మాత ఎ.వి.ఆర్. స్వామి తెలిపారు. ప్రిన్స్ మాట్లాడుతూ ‘‘అపర్ణగారికి థాంక్స్. టీమ్ అంతా ఎంతో కష్టపడి సినిమాను రూపొందించాం’’ అన్నారు.