Vijayashanthi : విజయశాంతికి వారసుడు ఉన్నాడా? లేడా? క్లారిటీ ఇచ్చేసింది
NQ Staff - April 2, 2023 / 07:50 PM IST

Vijayashanthi : లేడీ అమితాబచ్చన్ అంటూ పేరు దక్కించుకున్న సీనియర్ హీరోయిన్ విజయశాంతి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆమె సినిమా జీవితం మరియు రాజకీయ జీవితం గురించి అందరికీ తెలుసు కానీ వ్యక్తిగత విషయం గురించి మాత్రం ఎన్నో అనుమానాలు అపోహలు పుకార్లు ఉన్నాయి.
చాలా మందికి విజయశాంతి భర్త ఎలా ఉంటాడో తెలియదు.. గూగుల్ చేసినప్పుడు విజయశాంతి భర్త అంటూ కొన్ని ఫోటోలు వస్తున్నాయి. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి విజయశాంతి భర్త అయి ఉంటాడా అనే అనుమానాలు కూడా కొందరికి ఉన్నాయి.
ఈ సమయంలోనే విజయశాంతికి 25 సంవత్సరాల కొడుకు ఉన్నాడని ఆ కొడుకు త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రక రకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా మీడియాలో ఆ పుకార్లు తెగ హడావుడి సృష్టిస్తున్నాయి. దాంతో రాములమ్మ ఫ్యాన్స్ గందరగోళానికి గురి అవుతున్నారు.
ఈ నేపథ్యంలో విజయశాంతి క్లారిటీ ఇచ్చింది. తనకు కొడుకు లేడని.. తాను పెళ్లి చేసుకున్న తర్వాత సమాజ సేవ నిమిత్తం పిల్లలు వద్దు అనుకున్నాను అంటూ రాములమ్మ విజయశాంతి చెప్పుకొచ్చింది. దాంతో విజయశాంతి వారసులు అంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టినట్లు అయింది.