Vijay Varma : తమన్నాకు షాక్ ఇచ్చిన విజయ్ వర్మ.. మరో అమ్మాయి కావాలంటూ ప్రకటన..!
NQ Staff - May 16, 2023 / 12:00 PM IST
Vijay Varma : గత కొంత కాలంగా మిల్కీ బ్యూటీ తమన్నా గురించిన వార్తలు బాగా వస్తున్నాయి. ఎందుకంటే ఆమె నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందంటూ గాసిప్స్ వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియో కూడా వైరల్ అయింది. కానీ తమన్నా మత్రం వాటిని ఖండించింది. తాను ఎవరితో డేటింగ్ లో లేనంటూ తెలిపింది.
కానీ రీసెంట్ గా విజయ్ వర్మతో కలిసి డిన్నర్ డేట్ లో కెమెరాలకు కనిపించింది తమన్నా. దాంతో ఇద్దరి డేటింగ్ ను కన్ఫర్మ్ చేస్తున్నారు జనాలు. వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ వర్మ తాజాగా నటించిన వెబ్ సిరీస్ దాహడ్. ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా విజయ్ వర్మ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు.
అతని గుణగణాలు, అందచందాలు తెలియజేస్తూ వధువు కావలెను అని పోస్టర్ వేశారు. అనూహ్యంగా ఈ ప్రమోషనల్ పోస్టర్ వేరు రూటు తీసుకుంది. ఇది చూసిన నెటిజన్లు.. ఇంకో అమ్మాయి ఎందుకు తమన్నా ఉంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. తమన్నా ఉండగా మరో అమ్మాయిని ఎలా చేసుకుంటాడు.
ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు కదా అంటూ అడుగుతున్నారు. దీంతో ఈ పోస్టర్ కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి.