Varasudu : బిగ్ బ్రేకింగ్ : వారసుడు విడుదల తేదీ మార్పు
NQ Staff - January 8, 2023 / 11:07 PM IST

Varasudu : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణం లో రూపొందిన వారసుడు సినిమా జనవరి 11వ తారీఖున సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.
తమిళంతో పాటు తెలుగులో ఒకే సారి భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు చేస్తుందని విజయ్ అభిమానులు చాలా నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు.
ఈ సమయంలో సినిమా ను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది. రేపు వారసుడు చిత్ర యూనిట్ సభ్యులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. సినిమా యొక్క విడుదల వాయిదా విషయమై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.
గత రెండు మూడు రోజులుగా వారసుడు సినిమా తెలుగు వర్షన్ విడుదల కాకపోవచ్చు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళ్ వర్షన్ విడుదల అయ్యి తెలుగు వర్షన్ విడుదల కాకుంటే కచ్చితంగా డ్యామేజీ భారీగా ఉండే అవకాశం ఉంది.
అందుకే వాయిదా వేస్తే రెండు చోట్ల వాయిదా వేయాల్సి ఉంటుంది. ఆ విషయమై రేపు ప్రెస్ మీట్ లో అధికారికంగా దిల్ రాజు ప్రకటించే అవకాశం ఉంది. ఒక వేళ సినిమా విడుదల తేదీ మారిస్తే మాత్రం కచ్చితంగా విజయ్ అభిమానులు దిల్ రాజు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.