Vijay: తమిళ హీరో విజయ్ సరసన పూజా హెగ్దే, ‘బీస్ట్’ సినిమాలో నటించింది. అయితే, ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. మరోపక్క, ‘బీస్ట్’ సినిమా కోసం పూజా హెగ్దే, షూటింగ్ సందర్భంగా అదనపు లగ్జరీలు చేసిందనీ, దానికి సంబంధించిన ‘బిల్లును’ ఆమెకు చిత్ర నిర్మాణ సంస్థ పంపిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అంతే కాదు, పూజా హెగ్దేని ఐరన్ లెగ్.. అంటూ కోలీవుడ్ మీడియా ప్రచారం కూడా చేసింది. ‘బాయ్ కాట్ పూజా హెగ్దే..’ అంటూ కోలీవుడ్‌లో కొంత హంగామా కూడా నడిచింది.. అదీ సోషల్ మీడియా వేదికగా. దాంతో, పూజా హెగ్దే మళ్ళీ తమిళ సినిమాల్లో నటించే అవకాశం లేదంటూ రకరకాల విశ్లేషణలూ తెరపైకొచ్చాయి.
‘బీస్ట్’ కాంబినేషన్ రిపీట్ అవుతోందట.!
అయితే, పూజా హెగ్దే ఇంకోసారి ‘దళపతి’ విజయ్ సరసన నటించబోతోందన్నది తాజాగా గాసిప్. అయితే, హీరోయిన్‌గానా.? లేదంటే, ఐటమ్ బాంబులానా.? అన్నదానిపై కొంత సస్పెన్స్ వుంది.
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘విక్రమ్’ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ఇదే. ఈ సినిమా కోసం పూజా హెగ్దే పేరుని పరిశీలిస్తున్నారట. అదీ స్పెషల్ సాంగ్ కోసమని అంటున్నారు.
స్పెషల్ సాంగ్ కోసమే అయినా, ఆ సినిమాలో ఓ 20 నిమిషాల నిడివి వుండే పాత్రలోనూ ఆమె కనిపించబోతోందన్నది విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.