VIJAY: స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్న తమిళ స్టార్ హీరో.. ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ
Priyanka - May 3, 2021 / 12:14 PM IST

VIJAY ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. స్టార్ హీరోలందరు దాదాపు పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రాంతీయ భాష అభిమానులనే కాక పరాయి భాషలకు చెందిన ప్రేక్షకులని ఉత్సాహపరిచేందుకు రెడీ అవుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయనకు తమిళంలోనే కాదు తెలుగు, హిందీ భాషలలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ జరుపుకొని విడుదలయ్యాయి. ఇప్పుడు ఆయన స్ట్రైట్ తెలుగు సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది.
విజయ్ తెలుగులో స్ట్రైట్ మూవీ చేయనుండగా, ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నారట. రీసెంట్‌గా విజయ్‌ను చెన్నైలో కలిసిన వంశీ స్క్రిప్ట్ వివరించాడట. ఇది విజయ్‌కు ఎంతగానో నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ తన 65వ సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమా పూర్తయ్యాక వచ్చే ఏడాది వంశీ పైడిపల్లి చిత్రాన్ని మొదలు పెట్టనున్నాడని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు ఈ ద్విభాష చిత్రాన్ని నిర్మించనున్నారు. మరోవైపు విజయ్.. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు.సన్ పిక్చర్స్, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాలని నిర్మించనున్నాయి.