Vijay Sethupathi: కృతి శెట్టితో క‌లిసి న‌టించ‌లేను అని చెప్పిన విజ‌య్ సేతుప‌తి

Vijay Sethupathi: త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోను డిఫ‌రెంట్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంటున్నాడు. ఆయ‌న ఉప్పెన చిత్రంలో విల‌న్‌గా న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు.ఈ సినిమాలో విజ‌య్ విల‌క్ష‌ణ న‌ట‌న ఎంతో మందిని మెప్పించింది. తండ్రిగా విజ‌య్ సేతుప‌తి, కూతురిగా కృతి శెట్టి అద‌ర‌గొట్టారు. అయితే ఇప్పుడు కృతిశెట్టికి విజ‌య్ సేతుప‌తి జోడీగా న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌.

Vijay Sethupathi Rejected to Share screen with Kriti Shetty
Vijay Sethupathi Rejected to Share screen with Kriti Shetty

దీనిని విజ‌య్ సేతుప‌తి రిజెక్ట్ చేసిన‌ట్టు చెప్పుకొచ్చాడు. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా కృతిని ఎంపిక చేసేందుకు గాను మేకర్స్ ప్రయత్నించారట. అయితే ఆ నిర్ణయాన్ని విజయ్ సేతుపతి కొట్టిపాడేశాడు. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నా కొడుకుకు 15ఏళ్లు. ఇప్పుడు కృతి వ‌య‌స్సు 17 ఏళ్లు.


నా కూతురి లాంటి వ్య‌క్తితో క‌లిసి న‌టించ‌లేను అని విజ‌య్ పేర్కొన్నారు. కూతురిలా భావించిన అమ్మాయితో ఎలా రొమాన్స్ చేస్తాను చెప్పండి అంటూ యూనిట్ సభ్యులను ఒప్పించి మరో హీరోయిన్ ను ఎంపిక చేయించినట్లుగా తెలుస్తోంది. గ‌తంలో ఎంతో మంది హీరోలు త‌మ‌తో కూతురిగా న‌టించిన వారితో జ‌త‌క‌ట్టారు. దంగల్ లో కూతురుగా నటించిన హీరోయిన్ తో ఆ వెంటనే అమీర్ ఖాన్ రొమాన్స్ చేసిన విషయం తెల్సిందే. కాని విజయ్ సేతుపతి మాత్రం హుందాగా వ్యవహరించ‌డం గొప్ప విష‌యం అంటున్నారు.


ప్రస్తుతం విజయ్ సేతుపతి మోస్ట్ బిజీ హీరో కమ్ నటుడు. ఆయన వరుసగా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను దక్కించుకుంటున్న కారణంగా ఆఫర్లు బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి. తెలుగు లో ఆయన ఉప్పెన సినిమాతో బిగ్ సక్సెస్ ను దక్కించుకున్న నేపథ్యంలో మరిన్ని సినిమా ఛాన్స్ లు ఆయన తలుపు తడుతూనే ఉన్నాయి. త్వ‌ర‌లో ఆయ‌న న‌టిస్తున్న లాభం సినిమా విడుద‌ల కానుంది. మ‌రోవైపు స‌మంత‌, న‌య‌న్‌తో క‌లిసి ఓ సినిమా చేస్తున్నాడు విజ‌య్.