MAHESH BABU: మహేష్ బాబుని పక్కన పెట్టేశారా.. విజయ్ దేవరకొండ సడన్ ఎంట్రీతో అంతా షాక్..!

విజయ్ దేవరకొండ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబును పక్కన పెట్టడం ఏంటి అనుకుంటున్నారా..? కొన్నిసార్లు చిత్రం అలాగే జరుగుతుంది మరి. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. కమర్షియల్ యాడ్స్ చేయడంలో సౌత్ ఇండియాలో మహేష్ బాబుని మించిన వారు మరొకరు లేరు. ఎలాంటి హీరో అయినా ఆయన తర్వాతే. ఎండోర్స్ మెంట్ లో అంతగా దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. అలాంటి హీరోను ఇప్పుడు విజయ్ దేవరకొండ రీ ప్లేస్ చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా సంతూర్ యాడ్ లో మహేష్ బాబు మాత్రమే కనిపిస్తున్నాడు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతికి ఈ బ్రాండ్ వచ్చింది.

ఈయనతో పాటు రష్మిక మందన కూడా ఇందులో నటించబోతోంది. ఇద్దరికి సంబంధించిన ప్రమోషన్ కూడా పూర్తయిపోయింది. ఇద్దరికీ ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని సంతూర్ కోసం ఈ జంటను తీసుకున్నారు నిర్వాహకులు. త్వరలోనే ఈ యాడ్ టీవీలో ప్రసారం కానుంది. ప్లాపుల్లో ఉన్నా కూడా విజయ్ దేవరకొండ తన ఇమేజ్ మాత్రం పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. వరసగా ఎండోర్స్ మెంట్స్ దక్కించుకుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు బ్రాండ్ తన గుప్పిట్లోకి తీసుకున్నాడు.

పైగా రష్మిక మందన్న తోడు ఉండడంతో ఈ కమర్షియల్ యాడ్ కోసం అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. అసలు సంతూర్ యాడ్ అంటే బయట ఇమేజ్ బాగా ఉంటుంది. ఇప్పుడు దానికి ఈ ఆన్ స్క్రీన్ కపుల్ ను తీసుకొని మరింత క్రేజ్ పెంచేశారు నిర్వాహకులు. ఏదేమైనా కూడా మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ను రిప్లేస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అది చేసి చూపించాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు విజయ్.

Advertisement