VIJAY DEVARAKONDA: అభిమాని మృతి చూసి క‌న్నీరు పెట్టుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ చేసింది త‌క్కువ సినిమాలే. అందులో హిట్స్ కూడా రెండో మూడో ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం విజ‌య్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి మిగ‌తా హీరోల ఫ్యాన్స్ కూడా ఈర్ష్య ప‌డుతుంటారు. అయితే విజ‌య్‌ని ఫ్యాన్స్ ఎంతో ప్రేమిస్తుండ‌గా, అత‌ను కూడా అభిమానుల‌ని అంతే ప్రేమ‌గా చూసుకుంటాడు. రీసెంట్‌గా త‌న అభిమాని కోల్పోవడంతో ఎమోషనల్ అయ్యారు.

ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ .. అంతు చిక్క‌ని వ్యాధితో బాధ‌ప‌డుతున్న హేమంత్ అనే అభిమానితో వీడియో కాల్ మాట్లాడి అత‌ని చివ‌రి కోరిక తీర్చాడు. అంతేకాదు అభిమానికి టీ ష‌ర్ట్, గిఫ్ట్‌ల‌ను పంపి ఆనందింప‌జేశాడు. అయితే రీసెంట్‌గా ఆ అభిమాని మృతి చెంద‌డంతో చాలా ఎమోష‌న‌ల్ అవుతూ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మ‌నం మాట్లాడుకున్నందుకు సంతోషంగా ఉంది. నీ స్వ‌చ్ఛ‌మైన న‌వ్వు చూసే ఛాన్స్ వ‌చ్చింది. నీవు లేవ‌ని తెలిసి నా క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దేవుడిని నీ గురించి ప్రార్ధిస్తున్నాను. నీతో మాట్లాడిన ఈ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని ఎమోషనల్ అయ్యారు విజయ్.

Advertisement