Vijay deverakonda: మాటంటే మాటే… ప‌ది ల‌క్ష‌ల సాయం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay deverakonda: రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల‌తోనే కాదు మంచి మాన‌వ‌త్వంతోను అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్నాడు. ఆయ‌న సంద‌ర్భాన్ని బ‌ట్టి ప‌లు పుర‌స్కారాలు, గిఫ్ట్ లు అందిస్తూ ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూర‌గొంటాడు. 2021 క్రిస్మ‌స్‌కు కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఫ్యాన్స్‌కు.. అది కూడా ఇబ్బందుల్లోని 100 మందికి..మ‌నిషికి రూ.10 వేలు చొప్పున దేవర శాంటి పేరుతో సాయం చేస్తాన‌ని అన్నారు.

Vijay Deverakonda - Wikipedia

నిజంగానే డ‌బ్బులు అవ‌స‌ర‌మైన త‌మ తోటి వ్య‌క్తుల పేర్లు చెప్ప‌మ‌ని రౌడీ స్టార్ అన్నారు. అన్న‌మాట ప్ర‌కారం ఇప్పుడు సాయం అందించ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఆ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ‘‘మై లవ్స్ దేవర శాంటా లిస్టులో మీ పేరు ఉందా చూసుకోండి. త్వరలోనే మా టీమ్ సభ్యలు మిమ్మల్ని సంప్రదించి.. మీకు రావాల్సిన పదివేలను మీ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తారు’’ అని పేర్కొన్నారు.

100 మందికి ప‌ది వేల రూపాయ‌లు చొప్పున ఇవ్వ‌డ‌మంటే.. రూ.10 ల‌క్ష‌ల‌ను సాయంగా అందిస్తున్న‌ట్లు. నిజంగా రౌడీ స్టార్ మ‌న‌సు ఎంత మంచిదో అని నెటిజ‌న్స్ త‌న‌ను అప్రిషియేట్ చేస్తున్నారు. ఏదేమైన విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి మ‌న‌సున్న వ్య‌క్తి అని ఇంత చిన్న వ‌య‌స్సులో ఆయ‌న చేస్తున్నఈ సాయాలు గొప్ప‌వ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా మూవీ ‘లైగర్’లో యాక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేయడమే కాకుండా పూరి కనెక్ట్స్, పూరీ టూరింగ్ టాకీస్ పతాకాలపై ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ అసోసియేష‌న్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

vijay deverakonda stunning comments
vijay deverakonda stunning comments

బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య పాండే ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో జ‌త క‌ట్టింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. క‌రోనా ఎఫెక్ట్ మ‌ళ్లీ పెరిగిపోవ‌డంతో లైగ‌ర్ సినిమా షూటింగ్‌ను ఆపేశారు.