Vijay Deverakonda: ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆమె ఆనందానికి అవ‌ధులే లేవు..!

Vijay Deverakonda: యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంతో క‌ష్టంతో ఈ స్థాయికి ఎదిగి చాలా మందికి త‌న వంతు సాయం అందిస్తూ వ‌స్తున్నాడు. ఇండియన్ ఐడల్ 12 సీజన్ ఫైనల్ పోటీలో ఆరుగురు కంటెస్టెంట్లు పవన్‌దీప్ రాజన్, అరునితా కంజిలాల్, మహ్మద్ డానిష్, సయ్యాలి కాంబ్లే, నిహాల్ టారో, షణ్ముఖ ప్రియ పోటీ ప‌డ‌గా, షణ్ముఖ ప్రియకు విజయ్ దేవరకొండ సపోర్ట్‌గా నిలిచారు.

Vijay Deverakonda ఇండియన్ ఐడల్ ఫైనల్ పోటీలో వేదికపై షణ్ముఖ ప్రియ ఉండగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాయ్ షణ్ముఖ ప్రియ ఎట్లున్నావు అంటూ విజయ్ దేవరకొండ పలకరించారు. ఫైనల్ పోటీ సందర్భంగా నీకు నా లవ్ అండ్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని విజయ్ దేవరకొండ చెప్పగానే షణ్ముఖ ప్రియ, ఆమె తల్లి ఆనందంలో మునిగిపోయారు. షణ్ముఖ ప్రియ పాడుతుంటే మీరు లిప్ సింక్ చేసి పాడుతుంటే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తానని విజయ్ దేవరకొండ అనగానే.. షోలో ఉన్నవాళ్లంతా చప్పట్లతో మార్మోగించారు.

గెలుపు ఓటములు గురించి పట్టించకోవద్దు. నీ టాలెంట్‌ను పరిచయం చేస్తూ.. ఫైనల్‌ పోటీని ఎంజాయ్ చేయి. నీ జీవితానికి సరిపడే అనుభూతిని సొంతం చేసుకో అని చెప్పిన విజ‌య్.. గెలుపుతో హైదరాబాద్‌కు వస్తున్నావు. నీవు నన్ను కలుస్తున్నావు. నీకు నేను నా సినిమాలో పాడే ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పాడు. అన్న‌ట్టుగానే ష‌ణ్ముఖ ప్రియ‌కు త‌న తాజా చిత్రం లైగ‌ర్‌లో పాట పాడే అవ‌కాశం ఇచ్చాడు.

ఈ విష‌యాన్ని చిత్ర బృందం కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంటికి వెళ్లిన ష‌ణ్ముఖ ప్రియ ఆయ‌న‌ని క‌లిసి కొద్ది సేపు ముచ్చ‌టించింది. పూరీ జ‌గ‌న్నాథ్ తాను క‌లిసి ఎక్క‌డ పాట బాగుంటుందో అని చ‌ర్చించి డిసైడ్ చేశాం. త్వ‌ర‌లో నేను కూడా ఆ పాట వింటా అని విజ‌య్ చెప్పుకొచ్చారు. అనంత‌రం ష‌ణ్ముఖ‌కి విజ‌య్ తల్లి షాలువా క‌ప్పి బ‌ట్ట‌లు పెట్టింది. లైగ‌ర్ సినిమాలో ష‌ణ్ముఖ భాగం కావడంతో అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

లైగర్ కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణను వచ్చే వారం నుంచి గోవాలో ఆరంభించనున్నారు. నెల రోజులు పైగా సాగే ఈ షెడ్యూల్‌తో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం అంతా చిత్రీకరణలో పాల్గొంటుంది. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.