Vijay Deverakonda: మహేష్‌, ప్రభాస్‌ స్థానాలు గల్లంతు చేసి..ఎన్టీఆర్‌, బన్నీలకు మళ్లీ షాకిచ్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: అర్జున్ రెడ్డి సినిమాతో త‌న స్టామినాను అమాంతం పెంచుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ ప‌తాక స్థాయికి చేరింది. యంగ్ సెన్సేష‌న్‌గా పేరు ప్రఖ్యాత‌లు పొందిన విజ‌య్ ప్ర‌స్తుతం లైగ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంకు ‘సాలా క్రాస్‌బ్రీడ్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాలో విజయ్.. బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. చిత్రం కోసం విజయ్ ప్రత్యేకంగా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇది విజయ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీ కాగా, తెలుగుతోపాటు హింది, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ప్ర‌తి సినిమాకు త‌న రేంజ్ పెంచుకుంటూ వెళుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాడు. బాలీవుడ్ కాంబోగా తెరకెక్కుతున్న లైగ‌ర్ సినిమాకు జాకీచాన్‌తో పాటు అనేక హాలీవుడ్ నటులకు యాక్షన్ కొరియోగ్రాఫీ చేసిన యాండీ లాంగ్ ప‌ని చేస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నఈ చిత్రాన్ని పూరి క‌నెక్ట్స్ అసోసియేష‌న్‌తో ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, హిరూ యశ్ జోహర్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ యువ నటి అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు. ప్రముఖ మ్యాగజైన్‌ ‘హైదరాబాద్‌ టైమ్స్‌’ ప్రతి ఏడాదిలాగానే 2020 సంవత్సారానికి గాను ‘మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌’ జాబితాను విడుదల చేసింది. ఆన్‌లైన్ ఓటింగ్‌ ప్రక్రియలో వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాను రూపొందించారు. ‘హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్ 2020’ జాబితా ప్రకారం టాలీవుడ్‌ రౌడీ విజయ్ దేవరకొండ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విజయ్‌ 2018,2019 సంవ‌త్స‌రాల‌లోను ప్ర‌థ‌మ స్థానంలోనే ఉన్నాడు. 2020కి కూడా చాలా మంది అగ్రశ్రేణి తారలను ప‌క్క‌కు నెట్టి వ‌రుసగా మూడో సారి విజ‌య్ దేవ‌ర‌కొండ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ టైటిల్ ద‌క్కించుకున్నారు. ఆయ‌న త‌ర్వాతి స్థానంలో హీరో రామ్ ఉన్నాడు. కాగా, విజ‌య్ దేవ‌ర‌కొండ అతి త‌క్కువ స‌మ‌యంలోనే అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకోగా, అత‌నికి ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంత ఫాలోయింగ్ కలిగి ఉన్న మొదటి దక్షిణ భారత నటుడు విజయ్ దేవరకొండ కాగా, కేవలం మూడేళ్లలోనే అతను దానిని సాధించాడు.

హైద‌రాబాద్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ 2020 జాబితాలో టాప్ స్థానాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌క్కించుకోగా, ఆ త‌ర్వాతి స్థానాల‌లో రామ్, జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, నాగ శౌర్య‌, నాగ చైత‌న్య ఉన్నారు. టాలీవుడ్ నుండి సందీప్ కిషన్ 9వ స్థానాన్ని ద‌క్కించుకోగా, పదో స్థానంలో న‌వదీప్, ప‌ద‌కొండో స్థానంలో రానా ఉన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి 16వ స్థానం ద‌క్క‌డం గ‌మ‌నర్హం.