RASHMIKA: మ‌రోసారి సంద‌డి చేసిన ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వైర‌ల్‌గా మారిన వీడియో

టాలీవుడ్ క్యూట్ పెయిర్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక గీత గోవిందం చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స‌న్నివేశాల‌తో పాటు పాట‌ల‌లోను ఈ ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. సిల్వర్ స్క్రీన్ పై మంచి జోడీ అనిపించుకున్న వీరిద్దరూ రియల్ లైఫ్ లో రిలేష‌న్ షిప్ కొన‌సాగించారని, అందుకే హీరో రక్షిత్ శెట్టితో రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింద‌ని పుకార్లు షికారు చేశాయి. వీటిని ఏ మాత్రం ప‌ట్టించుకోని ఈ జంట త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళుతున్నారు.

తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ- ర‌ష్మిక జంట మ‌రోసారి ఆన్‌స్క్రీన్‌పై సంద‌డి చేశారు. అయితే ఈ సారి సిల్వ‌ర్ స్క్రీన్‌పై కాకుండా స్మాల్ స్క్రీన్‌పై మెరిసారు. సంతూర్ ప్రొడక్ట్ కొత్త బ్రాండ్ అంబాసిడర్స్ గా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఒప్పందం కుదుర్చుకోగా, వీరిద్దరితో ఇటీవల యాడ్ షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ మోకాళ్లపై కూర్చొని రష్మికకు ఓ గిఫ్ట్ అందిస్తున్నట్లు ఈ యాడ్ లో కనిపిస్తున్నారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇది నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కెరీర్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ర‌ష్మిక తెలుగు, త‌మిళం, హిందీ సినిమాలతో బిజీగా ఉంది.

Advertisement