Vijay-Kiara: గోవాలో చిల్ అవుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌-కియారా.. ఏం జ‌రుగుతుంది?

Vijay-Kiara: విజ‌య్ దేవర‌కొండ‌.. ఇప్పుడు ఈ పేరు స్టైల్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. త‌న న‌ట‌న‌తోనే కాకుండా స్టైల్, ఆటిట్యూడ్‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు విజ‌య్. త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ పాపులారిటీ పొందిన విజ‌య్ ప్ర‌స్తుతం లైగ‌ర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఛార్మి, క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన‌న్య పాండే క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Vijay-Kiara

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి అర్జున్ రెడ్డి సినిమాతో క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. పెళ్లి చూపులు, గీత గోవిందం సినిమాలు హిట్ అయిన అర్జున్ రెడ్డితో వ‌చ్చిన క్రేజే వేరు. ఈ మూడు సినిమాలు త‌ప్ప విజ‌య్ కెరీర్‌లో పెద్ద‌గా విజ‌యాలు సాధించిన దాఖ‌లాలు లేవు. అయితే ఈయ‌న‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమాల‌తో సంబంధం లేకుండా పెరుగుతూ పోతుంది. తెలంగాణ స్లాంగ్‌లో చాలా స్టైలిష్‌గా మాట్లాడుతూ అంద‌రిని బుట్ట‌లోవేసుకుంటాడు.

జాన్వీ క‌పూర్, సైరా అలీఖాన్‌ల‌ని కూడా బుట్ట‌లో వేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని కూడా ప‌డేశాడు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి దిగిన ఓ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో కియారా గ్లామర్ లుక్‌లో కనిపిస్తుండగా.. విజయ్ దేవరకొండ మాత్రం ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపించారు. ఈ పిక్ గోవా బీచ్‌లో దిగిందని తెలుస్తోంది. అయితే ఈ పిక్ రీసెంట్‌దా లేక గ‌తంలోదా అనే అనుమానం అంద‌రిలో క‌లుగుతుంది.

Vijay-Kiara

హీరోయిన్‌గా తొలి సినిమా ‘ఫగ్లీ’తోనే పరాజయాన్ని చవిచూసిన‌ కియారా అద్వానీ కబీర్‌ సింగ్‌, భరత్‌ అనే నేను చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్లు కూడా అందుకుని స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం కియారా,సిద్దార్థ మల్హోత్రా ప్రేమించుకుంటున్నట్లు గత ఏడాది నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ పార్టీలు, ఫంక్షన్లు, విహారాలు అంటూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పలుమార్లు మీడియా కంటపడ్డ విషయం తెలిసిందే. ఇక ఈ లవ్‌బర్డ్స్‌ ‘షేర్షా’ సినిమాలో కలిసి నటించారు.

ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో కియారా ఫొటో చూసి అంతా అవాక్క‌వుతున్నారు.ఇద్ద‌రి మధ్య ఏమైన న‌డుస్తుందా లేకుంటే యాడ్స్ షూటింగ్ లో భాగంగా ఇలా ఫొటోకి ఫోజులిచ్చారా అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. విజ‌య్ సాధార‌ణంగా హీరోయిన్స్‌తో చాలా స్నేహంగా మెదులుతుంటారు. పార్టీలు, పబ్స్ అంటూ చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటారు.