Vijay devarakonda : విజయ్ దేవరకొండ లైగర్ వర్సెస్ వరుణ్ తేజ్ గని..!

Vijay devarakonda: విజయ్ దేవరకొండ లైగర్ వర్సెస్ వరుణ్ తేజ్ గని..అన్న టాక్ మొదలైంది. ఎప్పుడైతే ఈ రెండు సినిమాల టైటిల్ తో పాటు విజయ్ – వరుణ్ ల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ రకరకాల కంపేరిజన్స్ మొదలయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకొని ఫాం లోకి వచ్చిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. స్వీయ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ అన్న పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ – ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూ – ఛార్మి నిర్మిస్తుండగా కరణ్ జోహార్‌ సమర్పిస్తున్నాడు.

vijay-devarakonda-vijaya-devarakonda-liger-vs-varun-tej
vijay-devarakonda-vijaya-devarakonda-liger-vs-varun-tej

తెలుగు హిందీ భాషాలతో పాటుగా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఇక ‘లైగర్’ లో విజయ్‌కు జంటగా అనన్య పాండే నటిస్తోంది. కాగా ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ‘లైగర్’ పూరి మార్క్ రివేంజ్ డ్రామాగా హై ఓల్టేజ్ యాక్షన్స్ ఎంటర్‌టైనర్ గా రూపొందనుంది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గని. కొర్రపాటి కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.

Vijay devarakonda : లైగర్ వర్సెస్ గని అన్న ప్రచారం ఎందుకు మొదలైంది ..?

కాగా ఇప్పుడు ‘లైగర్’ వర్సెస్ గని అంటూ ప్రచారం సాగుతోంది. ఈ రెండు సినిమాల స్టోరీ లైన్ ఒకటే అని అలాగే రెండు సినిమాలు కాస్త అటు ఇటుగా ఒకేసారి రిలీజ్ కానున్నాయని అంటున్నారు. వరుణ్ తేజ్ ‘గని’లో క్రీడాకారులపై చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపనున్నట్టు తెలుస్తోంది. ఒలింపిక్ పతకాలు సాధించిన వారిలో అందరు క్రీడాకారులకి రావాల్సిన గుర్తింపు రావడం లేదు. ఇదే మేయిన్ కథాంశం గా గని సినిమాని రూపొందిస్తున్నారు. రెండు ఒకటే జోనర్ లో వస్తున్న సినిమాలు కావడం తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలతో పాటు ఉత్కంఠత నెలకొంది. చూడాలి మరి విజయ్ దేవరకొండ – వరుణ్ తేజ్ లలో ఎవరి సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.

Advertisement