Pawan Kalyan-Vijay Devarakonda: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏంది అర్జున్ రెడ్డి డూప్‌లా క‌నిపిస్తున్నాడు.!

Pawan Kalyan-Vijay Devarakonda ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. ఈ పేరు ఒక ప్ర‌భంజ‌నం. అభిమానుల‌కు ఆరాధ్య దైవం. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని సినీ న‌టుడిగా క‌న్నా కూడా మంచి మ‌నిషిగా అభిమానులు ఎక్కువ ఇష్ట‌ప‌డుతుంటారు. ప‌వ‌ర్ స్టార్ పేరులో ఏం ప‌వ‌ర్ ఉందో తెలియ‌దు కాని ఆయ‌న పేరు చెబితే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఆ త‌ర్వాత సొంత టాలెంట్‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు.

రాజ‌కీయాల వ‌ల‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు మూడేళ్ల పాటు సినిమాకు దూరంగా ఉన్నారు.దీంతో అభిమానులు పిచ్చోళ్ల‌లా అయిపోయారు. తమ అభిమాన న‌టుడి సినిమాల‌లోకి రావాల‌ని కొంద‌రు పూజ‌లు కూడా చేశారు. అంద‌రి పూజ‌లు ఫ‌లించి ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీల్ సాబ్ అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజయం సాధించ‌డ‌మే కాకుండా అభిమానుల‌లో జోష్ నింపింది.

ప‌వన్ క‌ళ్యాణ్ స్టైల్‌, ఆయన యాటిట్యూడ్ అభిమానులే కాదు ఇండ‌స్ట్రీలోని కొంద‌రు హీరోలు కూడా అనుక‌రిస్తార‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. ప‌వ‌న్ న‌టించిన సినిమాలోని స్టిల్ ఒక‌టి విడుద‌ల అయిందంటే ప్ర‌తి ఒక్క‌రు కూడా అదే స్టైల్‌లో ర‌చ్చ చేస్తుండేవారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సంబంధించిన ఓల్డ్ పిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అచ్చం అర్జున్‌ రెడ్డి సినిమాలో విజయ్‌ దేవరకొండను పోలి ఉన్న పవన్ అన్ సీన్ పిక్ నిన్న సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

ప‌వ‌న్‌ని చూసే అర్జున్ రెడ్డి లుక్ డిజైన్ చేసి ఉంటారని కొంద‌రు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ లుక్ సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుండ‌గా, ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక సినిమా విషయాలకొస్తే.. అజ్ఞాతవాసి సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్‌ తీసుకున్న పవన్‌.. ఇటీవల ‘వకీల్ సాబ్‌’తో రీఎంట్రీ ఇచ్చాడు. భారీ విజ‌యం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు మ‌రోసారి థియేట‌ర్స్‌లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది.

ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. క‌రోనా వ‌ల‌న ఆగిన ఈ చిత్రం షూటింగ్ జూలై నుండి మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుంది. 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసుకొని వ‌చ్చే ఏడాదికి విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా పూర్త‌య్యాక హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు.