Charmme Kaur విజయ్ దేవరకొండ.. స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. వరుస సినిమాలతో బిజీ అయ్యారు. గీతాగోవిందం, టాక్సీవాలా సినిమాలతో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీ గా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రౌడీ అభిమానులు కూడా అంతే హైప్ క్రియేట్ చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా కోసం ముంబాయి షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకి పూరి జగన్నాధ్ డైరెక్టర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు కూడా ఛార్మి సెట్ లో ఉంటూ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. లైగర్ సినిమా షూటింగ్ బ్రేక్ లో, సరదాగా విజయ్ దేవరకొండకు బైక్ రైడింగ్ కు వెళ్ళింది. ముంబాయి రోడ్లపై టూ వీలర్ పై విజయ్ దేవరకొండను ఎక్కించుకుని ఛార్మి సరదాగా రైడ్ ని ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్ని చార్మి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ.. ఫన్ రైడ్ విత్ విజయ్ దేవరకొండ అంటూ రాసింది. దీంతో పాటు విజయ్, తన మీద ఎంతో నమ్మకంగా ఉన్నాడంటూ రాసి.. ఫన్నీ ఎమోజీస్ ని పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే లైగర్ షూటింగ్ మొత్తం కూడా ముంబాయిలో చేస్తున్నారు. రీసెంట్ గా లైగర్ సినిమాని స్టార్ట్ చేశారు. దర్శకుడు పూరి కంటిన్యూ గా వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను పూరి, ఛార్మిలతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.
As u can c , Vijay surely has a lot of trust on me 😂😂😂
Fun ride in mumbai in between shot gaps for #LIGER @TheDeverakonda pic.twitter.com/VYVOr8WM1B
— Charmme Kaur (@Charmmeofficial) February 19, 2021