Vijay: లాస్ వెగాస్ లో చిల్ అవుతున్న విజయ్ దేవరకొండ, అనన్యపాండే..

Vijay : యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రానుంది. ఇక ఈ సినిమాపై విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు.

Vijay chill with ananya
Vijay chill with ananya

ఇక ఈ సినిమాలో వరల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో ఈ మూవీని షేర్ చేసుకుంటున్నారు. ఈయన ఫస్ట్ లుక్ ని దీపావళి సందర్భంగా ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేశారు. లైగర్ సినిమాలో మైక్ టైసన్ లుక్ కి సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది.

ఈ సినిమా లేటెస్ట్ సినిమా కూడా అమెరికాలో ప్లాన్ చేశారనే విషయం తెలిసిందే. ఈ నెల 12 వ తేదీన లైగర్ టీమ్ మొత్తం లాగ్ వెగాస్ చేరుకుంది. మైక్ టైసన్, విజయ్ దేవరకొండ మధ్య పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

రీసెంట్ గా అమెరికా షెడ్యూల్ లో మైక్ టైసన్ ని విజయ్ దేవరకొండ. మైక్ టైసన్ తో కలిసి వర్క్ చేయడంపై చాలా సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. లేటెస్ట్ గా ఈ సినిమా షెడ్యూల్ కి సంబంధించి మరో ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

లైగర్ సినిమా షూటింగ్ లో భాగంగా.. అమెరికా, లాస్ వెగాస్ షూటింగ్ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ, అనన్యపాండేలు గుర్రం స్వారీ చేస్తున్న ఫోటోని షేర్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక విజయ్ దేవరకొండ అభిమానులు సైతం ఈ ఫోటోకి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.