Nayanthara: ఆమెలో నాకు న‌చ్చిన‌ క్వాలిటీ ఇదే: న‌య‌న‌తార ప్రియుడు

Samsthi 2210 - July 1, 2021 / 04:15 PM IST

Nayanthara: ఆమెలో నాకు న‌చ్చిన‌ క్వాలిటీ ఇదే: న‌య‌న‌తార  ప్రియుడు

Nayanthara: ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఉన్న ప్రేమ జంట‌ల‌లో క్యూట్ జంట ఎవరంటే న‌య‌న‌తార‌- విఘ్నేష్ శివ‌న్ త‌ప్ప‌క గుర్తుకొస్తారు.కొన్ని సంవ‌త్స‌రాల నుండి ప్రేమ‌లో ఉన్న ఈ జంట స‌హ‌జీవ‌నం కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. ఈ ప్రేమ ప‌క్షులు చేసే సంద‌డి ప్ర‌తి ఒక్క‌రికి షాక్ ఇస్తుంటుంది. ఓనం, న్యూయర్ సెలెబ్రేషన్స్, నయనతార అమ్మ బర్త్ డే సెలెబ్రేషన్స్ అంటూ ప్రియురాలితో విఘ్నేశ్ శివన్ చేసిన ఎంజాయ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

VIgnesh Shivan Spoke About Nayanthara

VIgnesh Shivan Spoke About Nayanthara

న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ఫొటోలు ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్య దైవ దర్శనాలతో బిజీగా మారిపోయారు ఈ జోడీ. ఈ మధ్య ఎక్కడ చూసినా.. ఏ గుళ్లో చూసినా కూడా నయన్, విఘ్నేష్ జంట కనిపిస్తుంది. ఓ వైపు ఆధ్యాత్మికం మూడ్‌లోనే ఉంటూ పార్టీలు కూడా చేసుకుంటున్నారు. మూడు ముళ్లు ఎప్పుడు అంటే ఆ విష‌యంపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌డం లేదు.

న‌య‌న‌తార జాతకంలో పెళ్లి యోగం లేదని కొందరు జ్యోతిష్కులు కుండ బద్ధలు కొట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే పెళ్లి కాకుండా సహజీవనం దగ్గరే నయన్ ఆగిపోయిందనే వాళ్లు కూడా లేకపోలేదు. ప్ర‌స్తుతం ఒకే ఇంట్లో ఈ జంట ఉంటుండ‌గా, ఆ మ‌ధ్య ఓ ఫోటో షేర్ చేసి గాలి కూడా తమ మధ్యకు రాకూడదన్నట్లు హత్తుకున్న‌ట్టు క‌నిపించారు. 2021లో కూడా తనకు పెళ్లి చేసుకోవడం యిష్టం లేదని.. వచ్చే ఏడాది చేసుకుంటామని విఘ్నేష్ ఇంట్లో చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

VIgnesh Shivan Spoke About Nayanthara

VIgnesh Shivan Spoke About Nayanthara

అయితే ఇటీవ‌ల విఘ్నేష్ శివ‌న్ వేసిన సెటైర్ హాట్ టాపిక్‌గా మారంది. న‌య‌న‌తార‌- విఘ్నేష్ శివ‌న్‌ల పెళ్లి అయిందంటూ ప్ర‌చారాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇప్పటికే నయనతారకు మీడియా 22 సార్లు పెళ్లి చేసిందంటూ ఫేక్ న్యూస్‌ల మీద విఘ్నేశ్ సెటైర్ వేశారు. ఇక తాజాగా విఘ్నేశ్ శివన్ తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టారు.

న‌య‌న‌తార‌తో మీరు దిగిన ఫొటో ఒక‌టి షేర్ చేయ‌మ‌ని అడ‌గ‌గా, అందుకు ఆమె నుదుటి మీద ముద్దు పెడుతున్న ఫొటో ఒక‌టి షేర్ చేశాడు. మ‌రో నెటిజన్ .. నయన్‌లో ఏ లక్షణం మీకు చాలా ఇష్టమని అడిగేశాడు. నయనతారలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ (తన మీద తనకు నమ్మకం) నాకు చాలా ఇష్టమని విఘ్నేశ్ శివన్ బధులిచ్చారు. విఘ్నేష్ శివ‌న్ చెప్పిన ఆన్స‌ర్స్ ప్ర‌స్తుతం ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

న‌య‌న‌తార ప్ర‌స్తుతం విఘ్నేష్ శివ‌న్ దర్శకత్వంలో న‌టిస్తుంది. విజయ్ సేతుపతి, సమంత, నయనతార ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read Today's Latest Entertainment in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us