Nayanthara: న‌య‌న‌తార త‌ల్లి బ‌ర్త్ డే వేడుక‌లో మెరిసిన విఘ్నేష్ శివ‌న్.. ఆక‌ట్టుకుంటున్న ఫొటోలు

Nayanthara: సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార త‌న న‌ట‌న‌తో తెలుగులో, తమిళంలో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన విష‌యం తెలిసిందే. వైవిధ్య‌మైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్న న‌య‌న‌తార గత ఆరు సంవత్సరాలుగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. 2015లో విఘ్నేష్‌ దర్వకత్వం వహించిన ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ అనే సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఆ స‌మ‌యంలో ఈ ఇద్దరి మ‌ధ్య ప్రేమ చిగురించింది.

VIgnesh Shivan in nayanthara mother Birthday Celebrations
VIgnesh Shivan in nayanthara mother Birthday Celebrations

అప్ప‌టి నుండి గాఢమైన ప్రేమలో ఉన్న ఈ ఇద్ద‌రు క‌లిసి పుట్టినరోజులు, న్యూ ఇయర్‌, వేలంటైన్స్‌ డే.. వంటి ప్రత్యేక సందర్భాలను విదేశాల్లో సెలబ్రేట్‌ చేసుకుంటూ.. అక్కడ దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో తమ ఫ్యాన్స్‌తో పంచుకునేవారు. ఇవి చూసి అభిమానులంతా వీళ్లది ప్రేమేనని అర్థం చేసుకున్నారు.. కానీ తమ ప్రేమ గురించి తమంతట తాముగా బహిర్గతం చేయలేదు ఈ క్యూట్‌ కపుల్.

లాక్‌డౌన్‌లో కొద్దిమంది కుటుంబ సభ్యులు మధ్య ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగినట్లు రీసెంట్‌గా న‌య‌న‌తార‌ తెలిపింది. అయితే త్వరలోనే పెళ్లి కూడా జరగనున్నట్లు స్పష్టం చేసింది. ఆ విష‌యాన్ని త‌ప్ప‌క తెలియ‌జేస్తాన‌ని అంది. న‌య‌న్- విఘ్నేష్ శివ‌న్‌ల పెళ్లి కాకున్నా కూడా విఘ్నేష్ ఆ ఇంటి అల్లుడిగానే చ‌లామ‌ణి అవుతున్నాడు.

VIgnesh Shivan in nayanthara mother Birthday Celebrations
VIgnesh Shivan in nayanthara mother Birthday Celebrations

నయనతార తల్లి ఓమన కురియన్ బర్త్ డేను వీరిద్దరూ కలిసి సెలెబ్రేట్ చేశారు. ఆమెతో కేక్ కట్ చేయించడంతో పాటు పూల గుచ్చాలు, బహుమతులు అందించి, ఆమెను సంతోష పరిచారు. నయనతార తల్లి బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

న‌య‌న‌తార‌ని విఘ్నేష్ శివ‌న్ ప్రేమ‌గా తంగ‌మ్ (బంగారం) అని పిలుస్తార‌ట‌. ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు ప్రేమ‌ను కురిపించుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు. ప్ర‌స్తుతం న‌య‌న‌తార‌..విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో స‌మంత‌, విజ‌య్ సేతుప‌తితో క‌లిసి న‌టిస్తుంది.