Venkatesh: ఇప్ప‌టి వ‌ర‌కు నార‌ప్ప ఎన్ని సినిమాలు చేశాడో తెలుసా?

Venkatesh: విక్టరీ వెంక‌టేష్ నార‌ప్ప చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. క‌రోనా వ‌ల‌న ఓటీటీలో తెగ సంద‌డి చేస్తున్నాడు. రానున్న రోజులలో మ‌రిన్ని సినిమాల‌తో సంద‌డి చేసేందుకు ఆయ‌న సిద్ధంగా ఉన్నాడు. 1986లో ఇండస్ట్రీకి వచ్చిన వెంకీ.. ఇన్నేళ్లలో వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మధ్యలో ఎప్పుడూ భారీ బ్రేక్ ఇచ్చింది లేదు. కనీసం ఏడాదికి ఒక్క సినిమా విడుదల చేస్తూ వచ్చాడు. ఈ మధ్యే కరోనా కారణంగా కొన్ని బ్రేకులు అయితే తీసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో ఈయన 75వ సినిమా మైలురాయికి దగ్గర పడ్డాడని లెక్కలు చూస్తుంటే అర్థమవుతుంది.

Venkatesh

తాజాగా నారప్ప సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా వెంకీ మాట్లాడుతూ తన జర్నీ గురించి ఓపెన్ అయ్యాడు. నారప్ప తన కెరీర్ లో డిఫెరెంట్ సినిమా అవుతుందని చెప్పాడు వెంకటేష్. దాంతో పాటు తన తర్వాతి సినిమాల గురించి కూడా ఓపెన్ అయ్యాడు. దృశ్యం 2 కూడా ఓటిటిలో విడుదల అవుతుందని చెప్పకనే చెప్పాడు వెంకటేష్. ఎఫ్ 3 మాత్రం థియేటర్స్ లో నవ్వులు పూయించడం ఖాయం అంటున్నాడు ఈయన.

ఇదిలా ఉంటే ఈయన 75వ సినిమాకు దర్శకుడు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 73 సినిమాలు పూర్తి చేసాడు వెంకటేష్. ఎఫ్ 3 సినిమా 74వ‌ది. దాంతో ఆ తర్వాత ఎవరితో చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అనే పేరు వినిపిస్తుంది. నిజానికి అరవింద సమేత కంటే ముందుగానే వెంకీతో ఓ సినిమాను అనౌన్స్ చేసాడు త్రివిక్రమ్. ఈయనతో ఓ మీడియం బడ్జెట్ సినిమా చేయాలనుకున్నాడు త్రివిక్రమ్. అయితే అరవింద సమేత రావడం.. ఆ వెంటనే అల్లు అర్జున్ సినిమాతో బిజీ కావడంతో వెంకీ సినిమా వెనక్కి వెళ్లిపోయింది.

Venkatesh

అదే సమయంలో వెంకటేష్ కూడా ఇతర సినిమాలతో బిజీ అయిపోయాడు. అయితే ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ గురించి చర్చ మొదలైంది. ఈ సారి కచ్చితంగా కలిసి పని చేయబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. తన కమిట్మెంట్స్ అన్నీ పూర్తైన తర్వాత వెంకటేష్ 75 బాధ్యత త్రివిక్రమ్ తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ర‌చ‌యిత‌గా ఉన్న‌పుడు వీళ్లిద్ద‌రి నువ్వు నాకు న‌చ్చావ్.. మ‌ల్లీశ్వ‌రి.. వాసు లాంటి సినిమాల‌కు క‌లిసి ప‌నిచేసారు. ద‌ర్శ‌కుడిగా మారిన త‌ర్వాత తొలిసారి ఈయ‌నతో సినిమా చేయ‌డానికి సిద్ధం అవుతున్నాడు త్రివిక్ర‌మ్. మ‌రి చూడాలిక‌.. ఈ కాంబినేష‌న్ ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో..?