CARONA: క‌రోనాను జ‌యించిన ల‌వ‌బుల్ క‌పుల్.. మా గురించి ప్రార్దించిన వారికి ధ‌న్య‌వాదాలు అంటూ ట్వీట్

క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో బుస‌లు కొడుతుంది. కాస్త అజాగ్ర‌త్త‌గా ఉంటే చాలా క‌రోనా త‌న ప్ర‌తాపం చూపిస్తుంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే బేధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఈ సమ‌యంలోను సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటుండ‌డంతో వారికి క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అవుతుంది. ఇప్ప‌టికే టాలీవుడ్, బాలీవుడ్ రంగానికి చెందిన చాలా మంది ప్ర‌ముఖుల‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. రీసెంట్‌గా ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి, బాలీవుడ్ న‌టుడు అర్జున రాంపాల్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు.

కొద్ది రోజుల క్రితం పొడుగు కాళ్లు సుంద‌రి క‌త్రినా కైఫ్ ఆమె ప్రియుడు విక్కీ కౌశ‌ల్ క‌రోనా బారిన ప‌డ్డారు. క‌రోనా పాజిటివ్ అని తెలియ‌గానే వెంట‌నే ఐసోలేష‌న్‌కు వెళ్లారు. ఇంట్లోనే ఉంటూ వైద్యులు చెప్పిన స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తూ క‌రోనా నుండి కోలుకున్నారు. ఒక్క‌రోజు గ్యాప్ లో ఇద్ద‌రికి క‌రోనా నెగెటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్ త‌మ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు . ఏప్రిల్ 16న త‌న‌కు నెగెటివ్ వ‌చ్చింద‌ని విక్కీ కౌశ‌ల్ తెలియ‌జేస్తూ, మీ మ‌నోహ‌ర‌మైన సందేశాల‌కు, శుభాకాంక్ష‌ల‌కు ధ‌న్య‌వాదాలు. కోలుకున్న‌వారంద‌రికి నా ప్రార్ద‌న‌లు. జాగ్ర‌త్త‌గా ఉండండి అని పేర్కొన్నాడు .

ఇక ఏప్రిల్ 17న క‌త్రినా కైఫ్ త‌న సోష‌ల్ మీడియాలో మేక‌ప్ లేకుండా దిగిన ఫొటో ఒక‌టి షేర్ చేస్తూ.. నెగెటివ్ వ‌చ్చింది. నేను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధించిన వారంద‌రికి ధ‌న్య‌వాదాలు. ఇది అద్భుతం. ఎంతో ప్రేమ ద‌క్కింది అని అభిమానుల‌ని ఉద్దేశించి క‌త్రినా త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఒక్క రోజులో ప్రేయ‌సి ప్రియులు కోలుకోవ‌డంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. కొన్నాళ్లుగా క‌త్రినా- విక్కీ కౌశ‌ల్ జంట ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు. కాని బ‌య‌టప‌డ‌డం లేదు.

Advertisement